twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జేబులో అది కనిపించడంతో 18 ఏనుగులు మీదకొచ్చాయి, అరణ్య షూటింగ్‌లో భయం వేసింది: రానా

    |

    విభిన్నమైన సినిమాలతో ఆడియెన్స్ ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే నటులలో రానా దగ్గుబాటి ఒకరు. ఆయన ఎలాంటి పాత్ర చేసినా కూడా సినిమాపై ఒక స్పెషల్ హైప్ క్రియేట్ చేసేలా ప్రమోట్ చేస్తారు. ఇక ఈ నెల 26న అరణ్య షూటింగ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా షూటింగ్ లో ఎదురైన కొన్ని భయానక సంఘటనల గురించి బయటపెట్టాడు.

    సినిమాలో గ్లోబల్ మెస్సేజ్

    సినిమాలో గ్లోబల్ మెస్సేజ్

    అరణ్య సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ లో సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం నెలకొన్న ఆధునిక పరిస్థితులలో అడవులు ఏ విధంగా నాశనం అవుతున్నాయి. కార్పోరేట్ కంపెనీలు అడవులను ఎలా అక్రమించుకుంటున్నాయి అనే కాన్సెప్ట్ మీద సినిమాను తెరకెక్కించినట్లు రానా తెలియజేశాడు. సినిమాలో గ్లోబల్ మెస్సేజ్ ఉన్నట్లు వివరించాడు.

    నిజమైన ఏనుగులతో..

    నిజమైన ఏనుగులతో..

    ఇక సినిమాలో ఏనుగులకు సంబంధించిన ఎపిసోడ్స్ చాలా కీలకం కావడంతో గ్రాఫిక్స్ తో కాకుండా నిజమైన ఏనుగులతోనే షూటింగ్ చేశారు. అయితే ఏనుగులను దూరం నుంచి చూడటం వేరు, పక్కన నిలబడి షూటింగ్ చేయడం వేరు అంటూ రానా తెలిపారు. ఒక సమయంలో ఏనుగులన్ని కూడా మీదకొచ్చినట్లు చెప్పాడు.

    వాటికి అలవాటు పడాలి

    వాటికి అలవాటు పడాలి

    రానా మాట్లాడుతూ.. నిజంగా 18 ఏనుగుల పక్కన నిలబడి షూటింగ్ చేయడం విభిన్నంగా అనిపించింది. థాయిలాండ్ లో పర్యటకుల కోసం ఉపయోగించే ఏనుగులతో 15రోజుల పాటు షూటింగ్ చేశాం. నిత్యం అవి మనుషుల మధ్య తిరిగేవే అయినప్పటికీ కొత్త వాళ్ళతో అంత ఈజీగా కనెక్ట్ కాలేవు. వాటికి కొంత అలవాటు పడాలి. షూటింగ్ సమయంలో వాటికి నేను మచ్చిక చేసుకున్నాను.. అని చెప్పాడు.

    ఏనుగుల మధ్య ఒక్కడినే

    ఏనుగుల మధ్య ఒక్కడినే

    వాటికి మనం తెలిసిన వ్యక్తి అయినప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే షూటింగ్స్ సమయాల్లో ఏనుగుల మధ్య నేను ఒక్కడినే నిలబడాల్సి వచ్చేది. కాస్త అటు ఇటు బెదిరినా పరిస్థితిలు మారిపోతాయి. అందుకే వాటిని మచ్చిక చేసుకోవడానికి కేబులో నేను ఎప్పుడు అరటిపండు లేదా ఒక బెల్లం ముక్క పెట్టుకొని ఉండేవాడిని.

    Recommended Video

    Rana Daggubati చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న Yasaswi Kondepudi | Sarigamapa Finale
    జేబులో అరటిపండు కనిపించడంతో

    జేబులో అరటిపండు కనిపించడంతో

    అయితే ఒకరోజు జేబులో నుంచి అరటిపండు కాస్త బయటకు కనిపించడంతో ఒక్కసారిగా ఏనుగులన్ని కూడా నా మీదకు వచ్చేశాయి. అవి నా దగ్గర చాలా అరటిపళ్ళు ఉన్నాయని అనుకున్నాయి. ఆ ఘటన నన్ను చాలా భయాన్ని కలిగించాయి. ఏదేమైనా ఏనుగులతో సినిమా చేయడం ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది అంటూ రానా దగ్గుబాటి వివరణ ఇచ్చారు.

    English summary
    Rana Daggubati is one of the actors who attracts the audience mostly with different movies. No matter what role he plays, he is promoted to create a special hype on the film. It is known that the audience is coming forward with the Aranya shooting on the 26th of this month. However in a recent interview Rana revealed about some of the horrific incidents encountered in the shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X