»   » నాజీవితాంతం ఉండే ఒకే ఫ్రెండ్ రామ్ చరణ్ మాత్రమే: రానా

నాజీవితాంతం ఉండే ఒకే ఫ్రెండ్ రామ్ చరణ్ మాత్రమే: రానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ప్రధానోత్సవానికి ప్రముఖ తెలుగు సినీ నటుడు రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెల్సుకదా. మొత్తానికి కార్యక్రమం మొత్తం హాయిగా నడిపించేసారు. కార్యక్రమం లో భాగంగానే రానా ని కొన్ని ప్రశ్నలు అడిగింది తన బ్రెస్ట్ ఫ్రెండ్, తనకు నచ్చిన చోటు, ఇష్టమైన ఫుడ్ లాంటి విషయాలను ఏ మాత్రం తడబడకుండా టక టక చెప్పేశాడు రానా. అవి అప్పటి హడావిడి లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గానీ ఇప్పుడు మాత్రం ఆ మాటలే వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ రోజు రానా చెప్పిన ఆన్సర్లేమిటో తెల్సా..???

Rana about Ramcharan in Sima award function 2017

ఒకే పాటను జీవితాంతం వినాల్సి వస్తే బాహుబలి సినిమాలోని మహిష్మతి టైటిల్ సాంగ్ నే వింటాడట. ఎప్పటికీ ఒకే నగరంలో ఉండాల్సి వస్తే హైదరాబాద్, ఒకే ఫుడ్ తినాల్సి వస్తే హాలీమ్, ఒకే సినిమా రోజూ చూడాల్సి వస్తే స్టార్ వార్స్ సినిమాలు చూస్తాడట. ఒకే షో ఎప్పటికీ చూడాల్సి వస్తే మాత్రం టీవీ ఆఫ్ చేసేస్తానన్నాడు రానా. ఒకే మనిషి జీవితాంతం ఫ్రెండ్ గా ఉండాల్సి వస్తే ఆ ప్లేస్ రామ్ చరణ్ కు మాత్రమే ఇస్తా అన్నాడు. అలాగే లైఫ్ లాంగ్ తన తండ్రే తనకు పెద్ద ప్రేక్షకుడు అని.. ఆయనిచ్చే ఫీడ్ బ్యాక్ తోనే చాలా డిసెషన్లు తీసుకుంటాను అని కూడా చెప్పాడు. , ఒకే స్టార్ తో జీవితాంతం గడపాల్సి వస్తే అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేను అన్నాడు. తాను పుట్టిన దగ్గర నుంచి స్టార్ల మధ్యే పెరిగాను కాబట్టి ఒకే స్టార్ ను ఎంపిక చేసుకోవటం కష్టమన్నాడు.

చివరిగా ఒక లవ్ ఎమోజీ ఇప్పుడు మీకు ఇస్తే ఇక్కడకు వచ్చిన వాళ్ళలో ఎవరికి ఇస్తారు అని అడిగితే.. టక్కున నటి ఖుష్బూ కు ఇస్తాను అన్నాడు. ''ఎందుకంటే నేను పుట్టినప్పుడు నుండి ఆవిడకు నేను తెలుసు. నాకు ఆవిడ తల్లి లాంటిది'' అని చెప్పాడు. మొత్తానికి భలే ఇంట్రెస్టింగ్ సమాధానాలు కదూ.

English summary
When the anchor asked him rapid fire questions.. Rana didn't wait for even a second to give his answers.. he was so quick. in SIIMA 2017
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu