twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    17 ఏళ్ల వయసులోనే ఆ పనులు.. దాని కోసం చాలా కోల్పోయా.. రానా

    |

    బాహుబలి సినిమా తర్వాత రానా దగ్గుబాటి కెరీర్ గ్రాఫ్ రివ్వున దూసుకెళ్తున్నది. ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత హథీ మేరే సాథీ, మరట్వాడా వర్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కే సినిమాలో. అమర్ చిత్ర కథ, ఎన్టీఆర్ బయోపిక్ లాంటి సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

    17 ఏళ్ల వయసులోనే

    17 ఏళ్ల వయసులోనే

    నేను 17 ఏళ్ల వయసులోనే పని చేయడం ప్రారంభించాను. చాలా ఫిలిం స్టూడియోలలో రకరకాల పనులు చేశాను. సినీ నిర్మాణంలో అనేక మెలుకువలు నేర్చుకొన్నాను. రానా ఓ యాక్టర్, నిర్మాత అనుకుంటే పొరపాటే. నాలో మంచి టెక్నిషియన్ ఉన్నాడు అని రానా తెలిపాడు.

    అలాంటి కల కనేవాడిని

    అలాంటి కల కనేవాడిని

    చిన్నతనంలోనే స్టార్ వార్స్ లాంటి సినిమాలు చూశాను. హలీవుడ్ దిగ్గజం జార్జ్ లుకాస్ మాదిరిగా ఓ భారీ సినీ సామ్రాజ్యాన్ని నిర్మించాలనే కలలు కన్నాను. ఆ కలను సాకారం చేసుకొనే ప్రయత్నంలో చాలా నేర్చుకొన్నాను అని రానా వెల్లడించాడు.

    ఎన్టీఆర్ బయోపిక్‌లో

    ఎన్టీఆర్ బయోపిక్‌లో

    ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించే అవకాశం రావడం గొప్ప అదృష్టం. నారా చంద్రబాబు నాయుడి పాత్రలో నటిస్తున్నాను. ఆ పాత్ర కోసం చాలా బరువు తగ్గాను. చంద్రబాబు ఎలా ఉంటాడు. ఆయన రూపం ఎలా ఉంటుంది. ఆ రూపానికి తగినట్టు ఎలా మలుచుకోవాలనే అంశాలపై భారీ కసరత్తు చేశాను అని రానా పేర్కొన్నాడు.

    కలలో కూడా ఊహించలేదని

    కలలో కూడా ఊహించలేదని

    నారా చంద్రబాబు నాయుడిగా గానీ, ఓ రాజకీయ వేత్త పాత్రలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. ఏ నటుడైనా అలాంటి పాత్రలో నటిస్తానని కలలో కూడా ఊహించడు. ఎన్టీఆర్ బయోపిక్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది అని రానా అన్నాడు.

    English summary
    The NTR biopic is one of the most anticipated biopics in the Telugu film industry. Rana Daggubati will be playing the current Chief Minister of Andhra, N Chandrababu Naidu, who happens to be NT Rama Rao’s son-in-law as well. Recently, the actor unveiled his look from the biopic on the former actor and AP CM NT Rama Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X