»   » రానా, అజిత్ కాంబో... మరోబాహుబలి గా రానున్న చోళరాజు?

రానా, అజిత్ కాంబో... మరోబాహుబలి గా రానున్న చోళరాజు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ భారీ ప్రాజెక్టులు బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో భల్లాలదేవ, చాణుక్యవీర భద్రుడి పాత్రల్లో నటించి ఒకేసారి రెండు సూపర్‌హిట్‌లను ఖాతాలో వేసుకున్నాడు నటుడు రానా. ఈ రెండు సినిమాల తర్వాత రానా మరో హిస్టారికల్ మూవీలో నటించేందుకు సైన్ చేశాడు రానా చోళుల కాలం నాటి ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చారిత్రక చిత్రంలో నటిస్తున్నాడు.

ప్రస్తుతం అజిత్ కూడా శివ దర్శకత్వంలో 'వివేగం' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతోంది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన వీరం .. వేదాళం సినిమాలు హిట్ కావడంతో, ఈ సారి హిట్ ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే ఊపులో ఇప్పుడు విష్ణువర్ధన్ విష్ణువర్థన్ దర్శకత్వం లో వస్తున్న చారిత్రాత్మక చిత్రం చోళరాజు కి కూడా ఓకే చెప్పేసాడు.

Rana daggubati in Ajith's historical film

ఈ సినిమాలో అజిత్ 'చోళరాజు'గా కనిపించనున్నాడని చెబుతున్నారు. గతంలో విష్ణువర్ధన్ తో అజిత్ చేసిన బిల్లా .. ఆరంభం సినిమాలు మాస్ ఆడియన్స్ ను అలరించాయి. అందువలన ఈ కాంబినేషన్ పై కూడా మంచి అంచనాలు వున్నాయి. ఇక రానా కూదా బాహుబలి2 పూర్తి చేసి ఘాజీ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు.

ఇక ఈ ఇద్దరూ కలిస్తే తమిళ్ చోళరాజు కూడా మరో బాహుబలి అవుతుందనేది తమిళ సినీ వర్గాల అభిప్రాయం అట. ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. షూటింగ్ లొకేషన్‌లో రానా, అజిత్ కలిసి ఉన్న ఫొటోను చూడవచ్చు.

English summary
Director Vishnu Vardhan is making a historical film in the backdrop of Chola dynasty with Ajith in the lead. Rana was offered an important role as a king for which he accepted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu