»   »  కన్నడ నటి రాగిణితో ఎఫైర్, రాణా ఆగ్రహం!

కన్నడ నటి రాగిణితో ఎఫైర్, రాణా ఆగ్రహం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో రాణా, త్రిష మధ్య ఎఫైర్ ఉన్నట్లు చాలా కాలంగా షికార్లు పుకార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాణా కన్నడ నటి రాగిణి ద్వివేదితో డేటింగ్ చేస్తున్నట్లు కన్నడ చిత్ర సీమలో పుకార్లు స్ప్రెడ్ అయ్యాయి. ఓ ప్రముఖ పత్రికలో ఈ విషయమై వార్త కూడా ప్రచురితమైంది.

ఈ పరిణామాలతో అసహనానికి గురైన రానా ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. 'ఓ అవార్డు రిహార్సల్ సెషన్స్ కు సంబంధించిన ఫోటోలు ప్రచురించి అవాస్తవ వార్తలు రాసారని, ఇది పూర్తిగా దిగజారుడు తనమే' అంటూ రాణా తన ట్విట్టర్లో పేర్కొన్నారు. రాగిణి ద్వివేది రాణా జీవితంలో స్పెషల్ పర్సన్ అని, వాళ్ల మధ్య స్నేహాన్ని మించిన బంధం ఉందని సదరు పత్రిక పేర్కొంది.

Rana Daggubati Denies His Relationship With Ragini Dwivedi

రాణా గురించి ఇలాంటి వార్తలు కొత్తమే కాదు. గతంలో బిపాసా బసుతో, ఆ తర్వాత త్రిషతో, ఇప్పుడు రాగిణి ద్వివేదితో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాగిణి ద్వివేది గురించి కూడా కన్నడ మీడియాలో గతంలో అనేక వార్తలు వచ్చాయి. కన్నడ నటుడు యోగేష్ తో ఆమెకు ఎఫైర్ ఉన్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా రాణాతో ఎఫైర్ విషయంలో ఆమె స్పందించలేదు.

రాణా సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం రాణా గుణశేఖర్ దర్శకత్వంలో 'రుద్రమదేవి' చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు ఆయన రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' చిత్రం చేస్తున్నారు.

English summary
South actor Rana Daggubati, who was linked up with Kannada actress Ragini Dwivedi, has rubbished the speculations. The actor has went gaga over leading daily for taking random photo of him and Ragini Dwivedi and posting it in a gossip column.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu