For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వేదికపైన కంటతడి పెట్టిన రానా.. సురేష్‌బాబు, అభిరామ్ అదే పరిస్థితి..

  By Rajababu
  |

  లీడర్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు రానా దగ్గుబాటి. ఆ తర్వాత బాహుబలితోపాటు పలు చిత్రాల్లో నటించాడు. కానీ సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్‌లో ఇంత వరకు రానా సినిమా చేయకపోవడం గమనార్హం. తాజాగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో తొలిసారి రానా నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమం జోగేంద్ర యువ గర్జన పేరుతో మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈవెంట్‌లో తాత రామానాయుడిని తలచుకొని ఉద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో కాజల్‌ అగర్వాల్‌, క్యాథరిన్ త్రెసా, పరుచూరి బ్రదర్స్, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు.

  రానా కంటతడి..

  రానా కంటతడి..

  ఈ కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. ఇంట్లో మాకు సినిమానే ప్రపంచం. నాన్న, బాబాయ్ ఎప్పుడూ సినిమాల గురించే మాట్లాడుకొంటాం. తొలిసారి నాన్న నిర్మాణ సారథ్యంలో సినిమా చేయడం చక్కటి అనుభూతి. నేనే రాజు నేనే మంత్రి చిత్రం చాలా ఎమోషనల్ అంశాలతో కూడిన చిత్రం. ఈ సినిమా తాతాగారు (రామానాయుడు) చూడలేకపోతున్నారు అనే బాధ వెంటాడుతున్నది అని భావోద్వేగానికి గురయ్యాడు. కళ్ల నుంచి టపటపా నీళ్లు రాలడంతో తుడుచుకొని తమాయించుకొన్నాడు. వెంటనే తేరుకొని ఈ సినిమాలో నా నటనను తాత గారు చూసి ఉంటే బాగుండు అని అనిపిస్తున్నది అని అన్నారు.

  Rana's Nene Raju Nene Mantri becomes world’s first movie With 3D Augmented Reality
  తాత లేని లోటు వెంటాడుతున్నది

  తాత లేని లోటు వెంటాడుతున్నది

  ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ముగిసేంత వరకు అంతా బాగానే జరిగింది. కానీ మా తాత లేని ఒకే ఒక లోటు వెంటాడుతున్నది. ఈ రోజు ఇక్కడ నిలుచుని ఉన్నానంటే ఆయన వల్లనే. ఈ రోజు సినిమా అర్థం అవుతున్నదంటే ఆయనే కారణం. ఆయన ఉన్నంత కాలం ఆయనతో సినిమా చేయలేదనే బాధ ఉంది.

  మా నాన్న గొప్ప నిర్మాత..

  మా నాన్న గొప్ప నిర్మాత..

  తాత గారు మాకు దూరమైన తర్వాత చాలా పాజిటివ్ అంశాలు జరుగుతున్నాయి. పైన ఉన్న ఆయన అవన్నీ సెట్ చేస్తూ ఉండి ఉంటాడేమో. ఈ సినిమా ద్వారా మా నాన్నతో పనిచేసే అవకాశం దక్కింది. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతి. ఆయన మంచి నిర్మాత.

  వెంకటేష్ ఫ్యాన్స్ ఉన్నారనే ధైర్యంతోనే..

  వెంకటేష్ ఫ్యాన్స్ ఉన్నారనే ధైర్యంతోనే..

  విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఉన్నారనే ధైర్యంతో సినిమాల్లోకి వచ్చాను. మీరు ఉన్నారనే భరోసాతోనే ఇతర భాషల్లో నటిస్తున్నాను. మీరు ఉన్నారని చెప్పండి హాలీవుడ్ సినిమా కూడా హైదరాబాద్‌లోనే చేస్తాను అని రానా ఉద్వేగంగా మాట్లాడారు. మంచి చిత్రాల్లో నటించాలన్నదే నా కోరిక. అందుకే మంచి కథలతో ముందుకు వస్తున్నాను. మీ దీవెనలు నాకు కావాలి అని రానా అన్నారు.

  ఫ్యాన్స్ కుటుంబంతో పాట రిలీజ్

  ఫ్యాన్స్ కుటుంబంతో పాట రిలీజ్

  నేనే రాజు నేనే మంత్రి సినిమాలోని పాటను వినూత్నంగా రిలీజ్ చేశారు. వెంకటేష్ అభిమాన సంఘాలకు సంబంధించిన సభ్యుల భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులతో పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మీ భర్తలను, కుటుంబ సభ్యులను మా సేవల కోసం అనుమతించడం చాలా అభినందనీయం. మీ వల్లే మేము ఇక్కడ ఉన్నాం. మీరు లేకపోతే మేము లేం అని రానా చెప్పారు.

  రామానాయుడికి రుణపడి ఉంటాను..

  రామానాయుడికి రుణపడి ఉంటాను..

  ఈ కార్యక్రమంలో శివాజీరాజా మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్ సంస్థకు తాను ఎంతో రుణపడి ఉంటాను. స్వర్గీయ రామానాయుడు గురించి ఈ కార్యక్రమంలో ఆయన గుర్తు చేసుకొన్నారు. నేనంటే రామానాయుడుగారికి చాలా ఇష్టం. ఓ సారి అవుట్ డోర్ షూటింగ్ సందర్భంగా రామానాయుడుగారితో నేను కలిసి ఉన్నాను. ఆ సందర్భంగా ఆయన కొంత అస్వస్థతకు గురయ్యాడు. దాంతో ఆయనను రెస్ట్ తీసుకొమని కోరితే.. నేను గెస్ట్‌హౌస్‌లో ఉన్నా.. మనసంతా షూటింగ్ వద్దే ఉంటుందని నాతోపాటు వచ్చారు.

  సురేష్‌బాబు కూడా అదే రీతిలో..

  సురేష్‌బాబు కూడా అదే రీతిలో..

  అలాగే నేనే రాజు నేనే మంత్రి షూటింగ్‌లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఈ షూటింగ్‌లో సురేష్‌బాబు కూడా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నేను రెస్ట్ తీసుకోమని చెప్పగా నేను గెస్ట్‌హౌస్ ఉన్నా నా మనసు అంతా షూటింగ్‌లోనే ఉంటుంది అని సురేష్‌బాబు చెప్పడం గమనార్హం. నిర్మాతలుగా వారి నిబద్ధతకు, అంకుఠిత దీక్షకు అది ఉదాహరణ మాత్రమే అని శివాజీ రాజా అన్నారు.

   యాంకర్లుగా రానా, నవదీప్

  యాంకర్లుగా రానా, నవదీప్

  జోగేంద్ర యువగర్జన కార్యక్రమంలో రానా, నవదీప్ యాంకర్ పాత్రలను పోషించారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొన్నారు. వేదికను అలంకరించిన పెద్దల గురించి చెబుతూ పలువురి నుంచి స్ఫూర్తి పొందినట్టు చెప్పారు. బిత్తిరి సత్తి, రచ్చ రవి తమదైన శైలిలో స్పందించి ఈ కార్యక్రమానికి హైలెట్‌గా నిలిచారు.

  English summary
  Rana Daggubati gets emotional at Nene Raju Nene Mantri promotional event. He recalled his grandfather Ramanaidu in this occasion and gets teared. Rana said Becuase of the Fans support I am doing movies in multiple languages. He asked the same support from the fans.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X