»   » జిమ్ లో అనుష్క ఎక్సరసైజ్ లు చేస్తూ...(వీడియో)

జిమ్ లో అనుష్క ఎక్సరసైజ్ లు చేస్తూ...(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'సైజ్‌ జీరో' చిత్ర యూనిట్ కి రానా దగ్గుబాటి వ్యాయామ పాఠాలు నేర్పారు. ఆరోగ్యంగా ఉండటం కోసం కొన్ని మెలకువలు నేర్పుతానంటూ అనుష్క(స్వీటీ), ప్రకాశ్‌ కోవెలమూడి, కనికలతో వివిధ రకాల వ్యాయామాలు చేయించారు. దీనికి సంబంధించిన ఓ సరదా వీడియోను అనుష్క తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

When Rana Daggubati turns trainer to the Size Zero Movie team...


Posted by Anushka Shetty on 28 November 2015

ప్రకాశ్‌ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్రల్లో నటించిన 'సైజ్‌ జీరో' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.


అనుష్క మాట్లాడుతూ '' బయటివాళ్లకే కాదు, సినిమా వాళ్లకూ బరువు పెరిగిపోతున్నామేమో అన్న అభద్రతాభావం ఉంటుంది. సైజ్‌ జీరో అంటే సన్నగా ఉండిపోవడం కాదు, సౌకర్యవంతంగా ఉండాలి. వ్యాయామాల్ని, ఆరోగ్య సూత్రాల్ని నేను ప్రోత్సహిస్తా కానీ మన సౌకర్యమూ ముఖ్యమే. ప్రకాష్‌ ఎలాంటి కథనైనా బాగా తెరకెక్కించగలడు. ఈ సినిమాకి కీరవాణిగారు తప్ప మరెవరూ న్యాయం చేయలేరనిపించింది. నేనొక్కదాన్నే కష్టపడితే సినిమా కాదు. ఇలాంటి సినిమా తెరకెక్కించాలంటే కసి, పట్టుదలతో కూడిన ఒక మంచి బృందం కావాలి. అలాంటి బృందం ఈ సినిమాకి దొరికింది''అని చెప్పింది.


Rana Daggubati turns trainer to Anushka

రానా మాట్లాడుతూ ''నాకు తెలిసి తెలుగు, తమిళ పరిశ్రమల్లో అతి పెద్ద హీరో అనుష్క. చరిత్రలో అనుష్కకోసం ఒక పుస్తకమే రాయాలి. ప్రకాష్‌ భారతదేశం గర్వించదగ్గ పెద్ద దర్శకుడు అవుతాడ''న్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ''నాకు స్వతహాగా ఫాంటసీ కథలంటే ఇష్టం. కానీ నా శ్రీమతి కనికా ఈ కథ చెప్పాక చేస్తే ఇలాంటి సినిమానే చేయాలనిపించింది. ఈ కథని పెద్ద సినిమాగా తీద్దామని చెప్పి నాకు కావల్సిన సాంకేతిక నిపుణుల్ని, నటీనటుల్ని ఇచ్చారు. చిత్రీకరణని ఎంత ఆస్వాదించానో, కీరవాణిగారి సంగీతాన్నీ అంతే ఆస్వాదించా. అనుష్క 'కృత్రిమ పద్ధతిలో కాకుండా ఎంత కావాలంటే అంత సహజంగానే బరువు పెరుగుతా' అని చెప్పింది''అన్నారు.

English summary
When Rana Daggubati turns trainer to the Size Zero Movie team...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu