»   » గ్యాంగ్‌తో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసిన రానా...ఎవరెవరంటే?

గ్యాంగ్‌తో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేసిన రానా...ఎవరెవరంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు నటుడు రానా తాజాగా తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఒకటి చర్చనీయాంశం అయింది. ఈ వీకెండ్ మా గ్యాంగ్ తో కలిసి బాగా ఎంజాయ్ చేసాం. చాలా రోజుల తర్వాత హ్యాపీగా గడిపాను అంటూ ట్వీట్ చేసారు. తన గ్యాంగ్ లో ఉన్న వారి పేర్లు కూడా వెల్లడించారు. వారు మరెవరో కాదు... నాని, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, తాప్సీ, అల్లరి నరేష్ తదితరులు. వీరితో ఈ వీకెండ్ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత తిరిగి తాను నటిస్తున్న 'ఘాజి' సినిమా షూటింగుకు వెళ్లి పోయాడు రానా.

టాలీవుడ్లో రానా, నాని, అల్లరి నరేష్, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, తాప్సీ క్లోజ్ ఫ్రెండ్స్. ఏ చిన్న సమయం దొరికినా అంతా కలిసి పార్టీలు చేసుకోవడం, హ్యాపీగా గడపటం లాంటివి చేస్తుంటారు. అయితే అంతా ఎప్పుడూ సినిమా షూటింగులతో బిజీగా ఉంటారు. ఎప్పుడో కానీ వీరు కలవడానికి సమయం దొరకదు. ఇపుడు వీలు దొరకడంతో అంతా ఒక చోట చేరి ఎంజాయ్ చేసారు. ఈ విషయాన్ని రానా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

రానా నటిస్తున్న 'ఘాజీ' సినిమా విషయానికొస్తే...
జలాంతర్గామి నేపథ్యంలో సాగే 'ఘాజీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ జరుగుతోంది. హైదరాబాద్‌లో రెండు సబ్‌మెరేన్‌ సెట్లను ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అద్భు తంగా వేసింది. ఇందులో దాదాపు 20గంటల పాటు వాటర్‌లో వుండే సన్నివేశాలను చిత్రిస్తు న్నట్లు తెలుస్తోంది. 'ద బ్లూ ఫిష్‌' నవల ఆధా రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాకిస్తాన్‌ సబ్‌మెరేన్‌ పిఎన్‌ఎస్‌ ఘాజీ సముద్రమార్గంలో వెళ్ళినప్పుడు ఏర్పడిన సంఘటనలను చిత్రంగా మలుస్తున్నారు. ఇందులో ఇండియన్‌ నావీ కమాండర్‌గా రానా నటిస్తున్నాడు. హిందీ, తెలుగు భాషల్లో రూపొందనున్న థ్రిల్లర్‌ మూవీని పివిపి బేనర్‌లో నిర్మిస్తుండగా, సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 70కోట్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

English summary
"What a fun weekend. Such pleasure and fun it is to hang with the gang NameisNani Rakulpreet ReginaCassandra taapsee allarinaresh" Rana tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu