»   » లీగల్ చిక్కుల్లో శేఖర్ కమ్ముల లీడర్

లీగల్ చిక్కుల్లో శేఖర్ కమ్ముల లీడర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాణాని హీరోగా పరిచయం చేస్తూ ఎవియం వారు నిర్మించిన లీడర్ చిత్రం లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ఈ నెల(పిబ్రవరి 2009) 19న రిలీజ్ అయ్యే చిత్రంపై వైజాగ్ కి చెందిన ఓ లోకల్ న్యూస్ పేపర్ వారు కేసు నమోదు చేసారు. రమణ మూర్తి అనే ఆయన నడిపే లీడర్ అనే ఈవినింగ్ ఎడిషన్ పేపరు టైటిల్ లోగోను యధాతధంగా కాపీ కొడ్తూ లీడర్ చిత్రం లోగోను రూపొందించారని కంప్లైంటు. అలాగే వారు తాము డబ్బు కోసమో, పేరు కోసమో, పబ్లిసిటీ కోసమో ఈ విషయం బయిటకు తేలేదని కేవలం తమకు తెలియబరచకుండా తమ లోగోను యధాతదంగా వాడుకోవటమే తమకు మనో వేదన కల్గించే దీనిపే కేసు వేయాల్సి వచ్చిందంటున్నారు. ఇప్పటికే హీరోకు, దర్శకుడుకి, బ్యానర్ వారికి లీగల్ నోటిసులు పంపటం జరిగిందని వారు స్పందిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఇక మొన్నటి వరకూ శివ అనే దర్శకత్వ విభాగం వ్యక్తి ఈ చిత్రం కథ తనదేనని రైటర్స్ అశోషియేషన్ ద్వారా పోరాడిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu