For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'డిపార్టమెంట్' లో రానా ఫస్ట్ లుక్ అదుర్స్

  By Srikanya
  |

  రానా తొలిసారిగా పోలీస్ డ్రస్ లో కనపించి అదరకొట్టారు. రామ్ గోపాల్ వర్మ దర్సకత్వంలో రూపొందుతున్న డిపార్టమెంట్ చిత్రంలో ఆయన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. దానికి సంభందించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. అదిచూసిన వారంతా చాలా మెచ్చుకుంటున్నారు. ఇక ఈ చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ కావటంతో అంతటా ఆసక్తి నెలకొని ఉంది. ఇక ఈ లుక్ కోసం రానా చాలా బాగా కష్టపడ్డారని చెప్తున్నారు. అండరగ్రౌండ్ వరల్డ్ ని ఓ డాన్ రన్ చేస్తూంటాడు. అయితే పోలీస్ వ్యవస్ధ డాన్ మాత్రం డిపార్డ్ మెంట్..అంటూ తన కొత్త చిత్రానికి డిపార్టమెంట్ అనే పేరు ఎందుకు పెట్టానో రామ్ గోపాల్ వర్మ వివరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలను కూడా దయానాయక్, విజయ్ సలార్కర్, ప్రదీప్ శర్మ, సచిన్ వేజి ల నిజ జీవితాలనుంచి ప్రేరణ పొందిన కథతో రూపొందించనున్నారు.

  వీరు రకరకాలకుగా అండర్ వరల్డ్ డాన్ లను ఎదుర్కొంటారు. అయితే వీరి మధ్య రకరకాల ఇగోలు,సమస్యలు ఉంటాయి. అవి డిపార్టమెంట్ లో పనిచేసే మిగతా వారిపై పడతాయి. వీటిని సమన్వయపరుస్తూ సిటీని ప్రశాంతంగా ఉంచటానికి అమితాబ్ పాత్ర కృషి చేస్తూంటుంది. పూర్తి స్ధాయి యాక్షన్ పేకెడ్ గా రూపొందే ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్సపీరియన్స్ ని ఇస్తుందని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి స్క్రిప్టు వర్క్ జరుగుతోంది..అంతకు మించి ఈ చిత్రంపై ఏమీ వ్యాఖ్యానించలేనంటున్నారు వర్మ.

  ఈ చిత్రం గోవింద నిహలానీ అర్ధ సత్య తరహాలో ఉంటుందని, పోలీస్ డిపార్టమెంట్ లోని లోటు పాట్లని కాస్త లోతుగానే తన దైన శైలిలో ఆవిష్కరించనున్నాడని తెలుస్తోంది. ఈ దేశంలోని లా పోర్స్ ఎలా పనిచేస్తోందనే విషయాన్ని ఎక్సపోజ్ చేస్తున్నాని చెప్తున్నారు. ఇక అంతర్గత సమాచారం ప్రకారం కంపెనీ చిత్రం చేస్తున్నప్పుడే ఈ ఐడియా వచ్చిందని, మాఫియా మాదిరిగానే పోలీస్ డిపార్టమెంట్ లోపల ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంటుందని అదే యుఎస్ పి గా ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈచిత్రంలో పోలీస్ ఎనకౌంటర్ కిల్లింగ్స్ దగ్గరనుంచి, మాఫియా డీలింగ్స్, టెర్రరిస్టులుతో లింక్ లు దాకా ఈ చిత్రంలో చర్చించనున్నారని తెలుస్తోంది.

  మరో ప్రక్క రానా .. 'నా ఇష్టం" టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఓ రొమాంటిక్ కామిడీగా రూపొందుతోంది. అందాల హాసిని జెనీలియా డిసౌజా హీరోయిన్ గా, ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నా ఇష్టం'. జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఇటీవల రాణా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మించిన "నేను- నా రాక్షసి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అదీకాక రాణా ఇంకా తనను తాను ఒక పక్కా కమర్షియల్ మాస్ హీరోగా నిరూపించుకోవలసి ఉంది.

  English summary
  The first look of Rana from Ram Gopal Varma's Department is out. Rana plays a cop in the movie which has stellar cast - Amitabh Bachchan and Sanjay Dutt.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X