twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరైనా సూపర్ స్టార్ కావొచ్చు అంటున్న హీరో

    By Srikanya
    |

    Ranbir Kapoor
    ముంబై: వసూళ్లే 'సూపర్‌స్టార్' హోదాను నిర్ణయించలేవని, ఎవరినీ అధిగమించేందుకు తాను పరిశ్రమలోకి రాలేనన్నాడు. మంచి పాత్రల్లో నటించి, నటుడిగా ఓ మంచి గుర్తింపును సంపాదించుకోవాలనేదే తన లక్ష్యమని చెప్పాడు. తానే తరువాత తరంలో సూపర్‌స్టార్ అనే విషయాన్ని నమ్మనని, ఎవరైనా సూపర్‌స్టార్‌లు కావొచ్చన్నాడు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్.

    సల్మాన్, షారుక్, ఆమిర్ తదితర ఖాన్‌దాన్ తర్వాత సూపర్‌స్టార్ మీరేనట కదా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు రణ్‌బీర్ పైవిధంగా స్పందించాడు. ఆ హోదాకు సరైన న్యాయం కూడా తాను చేయలేనన్నాడు. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో సూపర్‌స్టార్‌లుగా పిలిపించుకుంటున్న ఖాన్‌లతో తనను సరిపోల్చి చూడడం సరికాదన్నాడు. అలాగే తన పేరుకు ముందు, వెనుక 'సూపర్‌స్టార్' ని తగిలించుకోవడం తనకు ఇష్టంలేదంటున్నాడు రణ్ బీర్ కపూర్.

    2007లో సంజయ్‌లీలా భన్సాలీ చిత్రం 'సావరియా' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రణ్‌బీర్ తన కెరీర్‌లో విమర్శకుల ప్రశంసలందుకునే ఎన్నో పాత్రల్లో నటించాడు. బచ్‌నా ఏ హసీనో, వేక్ అప్ సిద్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, రాకెట్ సింగ్, రాజ్‌నీతి, రాక్‌స్టార్, బర్ఫీ, తాజాగా యే జవానీ హై దివానీ తదితర చిత్రాల్లో నటించిన రణ్‌బీర్ ఎప్పుడో వంద కోట్లు వసూలు చేసిన సినిమాల క్లబ్‌లో చేరిపోయాడు.

    అలాగే ఖాన్‌లతో తనను పోల్చడం గురించి మాట్లాడుతూ... వారు దాదాపు 25 సంవత్సరాలుగా తీవ్రంగా శ్రమిస్తూ ఎంతోమంది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నారని, వారికి తాను కనీసం దరిదాపుల్లో కూడా లేనన్నాడు. ఒకవేళ తనను వారితో పోల్చాలనుకుంటే 25 సంవత్సరాల తర్వాత ఆ పనిచేయాలని సలహా ఇచ్చాడు. పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదేళ్లయినా కాలేదని, ఇంకా తాను నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు.

    English summary
    Ranbir’s debut film, Saawariya bit the dust, everyone knew that this boy has a special spark. But no one perhaps imagined him to grow at the kind of speed that he is growing.Rishi Kapoor might have been appareciated for his chocolate boy looks, his style and his acting calibre, but unfortunately he never got elevated to the superstar status. Looks like his son Ranbir will compensate for all that and more. Yeh Jawani Hai Deewani is just the 10th film of Ranbir’s five year long career. Given the buzz of the film high bucks are being offered to pick up the rights of the film. Starting with Saawariya, which bombed, over the last five years and nine films he has slowly and steadily gained the confidence of the audience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X