»   » తేల్చేసాడు: రూమర్స్ నిజమే...ఆమెతోనే ప్రేమ,పెళ్లి

తేల్చేసాడు: రూమర్స్ నిజమే...ఆమెతోనే ప్రేమ,పెళ్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మొత్తానికి బాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ రణబీర్ కపూర్ తన ప్రేమ,వివాహం గురించి తొలిసారిగా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. తన అభిమానులకు ఆనందాన్ని కలగ చేసాడు. వీరి ఇద్దరి వివాహం గురించి గత కొంత కాలంగా బాలీవుడ్ లో పెద్ద చర్చ నడుస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వాస్తవానికి ...రణ్‌బీర్‌ కపూర్‌, కత్రినా కైఫ్‌ల ఇద్దరూ తొలిసారిగా కలసి నటించిన 'అజబ్‌ ప్రేమ్‌ కీ ఘజబ్‌ కహానీ' సమయం నుంచే వారి మధ్య బంధం అల్లుకుంది. కానీ ఇన్నాళ్లూ తమ ప్రేమ విషయం బయటపడకుండా ఇద్దరూ జాగ్రత్తపడ్డారు. అయితే వారు రహస్యంగా షికార్లు చేస్తున్న ఫొటోలు మీడియాకు చిక్కడంతో ఇద్దరి మధ్య 'సమ్ థింగ్' అన్న ప్రచారం మొదలైంది.

Ranbir announced marriage with Katrina

దానికి తోడు ఆ తర్వాత రణ్‌బీర్‌ కుటుంబంతో కలసి కత్రినా విందులో పాల్గొందన్న విషయం గుప్పుమంది. ఇక వారి వివాహ ఘడియలు వచ్చేసాయి ...త్వరలోనే అని అందరూ అనుకున్నారు. ఆ శుభకార్యం గురించి ఎప్పుడు ప్రకటిస్తారా అని అటు పరిశ్రమ ఇటు మీడియా ఎదురు చూస్తోంది. ఈ విషయాన్ని ఇంకెన్నాళ్లో దాచిపెట్టలేం అనుకున్నాడో ఏమో... ఎట్టకేలకు రణ్‌బీర్‌ పెదవివిప్పాడు. కత్రినాను పెళ్లాడబోతున్నట్లు కుండ బద్దలుకొట్టాడు.

ఓ రీజనల్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ...''కత్రినాతో ప్రేమలో ఉన్న విషయం నిజమే. సినిమా కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి పుకార్ల నుంచి దూరంగా ఉండాలనుకున్నాను. అందుకే మా ప్రేమ గురించి ఇన్నాళ్లూ మాట్లాడలేదు. ప్రస్తుతం నేను, కత్రినా సినిమాలతో బిజీగా ఉన్నాం. అందుకే వచ్చే ఏడాది ఆఖరులో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం'' అని చెప్పాడు రణ్‌బీర్‌.

Ranbir announced marriage with Katrina

నాకిప్పుడు 33...నాకు కుటుంబం కావాలి...అలాగే...తమకంటూ ఓ కుటుంబం కావాలని తనతో పాటు కత్రినా కూడా కోరుకుంటోందని... అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నామని చెప్పాడు రణ్‌బీర్‌. ఇందులో దాయాల్సినంత విషయమేమీ లేదన్నారు.

గతంలో డిసెంబర్ 30న వీరి ఎంగేజ్ మెంట్ జరిగిందని, వీరిద్దరూ ముంబై బాంద్రాలో ఓ ఇంటికి మారారని, ఇద్దరూ కలిసే ఉంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే రణబీర్ ఈ విషయాలపై నోరు విప్పలేదు. 'అజబ్‌ ప్రేమ్‌ కీ ఘజబ్‌ కహానీ' చిత్రం తర్వాత ...వీరిద్దరూ రాజనీతి చిత్రం చేసారు. ఆ తర్వాత వీరు కలిసి చేసిన జగ్గ జాసూస్ చిత్రం వచ్చే సంవత్సరం విడుదల కానుంది.

English summary
Ranbir said he is getting married to his long time girlfriend Katrina Kaif. I'm now 33 and i want a family. Katrina wants the same. There is no need to hide anything. We both are busy with full of commitments. I'm thinking of getting married towards the end of next year., "Ranbir said in an interview
Please Wait while comments are loading...