»   » షాకింగ్ ఓల్డ్ ఫోటో: ఆ పిల్లాడే... ఇపుడు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్స్!

షాకింగ్ ఓల్డ్ ఫోటో: ఆ పిల్లాడే... ఇపుడు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్, ఐశ్వర్యరాయ్ జోడీగా నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. వాటిలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్ అనేలా ఉండటమే అందుకు కారణం. అయితే వాస్తవానికి వయసు పరంగా చూస్తే ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల గ్యాప్ ఉంది. అయినా ఇద్దరి జోడీ స్క్రీన్ మీద సూపర్బ్‌గా సెట్టవ్వడం విశేషం.

తాజాగా ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్ లకు సంబంధించిన ఓల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 18 సంవత్సరాల క్రితం నాటి ఫోటో అది. అపుడు ఐశ్వర్యారయ్ వయసు 25 సంవత్సరాలు. బాలీవుడ్లో హీరోయిన్ గా రాణిస్తున్న రోజులవి. పక్కనే 15 సంవత్సరాల వయసున్న రణబీర్ కపూర్.

ఎప్పటి ఫోటో ఇది?

ఎప్పటి ఫోటో ఇది?

రణ్‌బీర్‌ తండ్రి రిషి కపూర్‌ తొలిసారి దర్శకత్వం వహించిన ‘ఆ అబ్‌ లౌట్‌ చలే' సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడు రణ్‌బీర్‌ ఈ సినిమాకి తండ్రి దగ్గర సహాయ దర్శకుడిగా చేస్తున్నాడు. ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, ఐశ్వర్య రాయ్‌లు నటించారు. అప్పుడు దిగిన ఫొటోనే ఇది.

ఆ పిల్లాడే... ఇపుడు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్స్ చేస్తున్నాడు

ఆ పిల్లాడే... ఇపుడు ఐశ్వర్యరాయ్‌తో రొమాన్స్ చేస్తున్నాడు

ఈ ఫోటో చూసిన చాలా మంది షాకవుతున్నారు. ఐశ్వర్యరాయ్ పక్కన నిలబడ్డ ఈ పిల్లాడే ఇపుడు ‘యేదిల్ హై ముష్కిల్' చిత్రంలో ఆమెతో కలిసి రొమాన్స్ చేస్తుండటం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.

ఐశ్వర్యరాయ్ గురించి రణబీర్ మాట్లాడుతూ..

ఐశ్వర్యరాయ్ గురించి రణబీర్ మాట్లాడుతూ..

‘ఐశ్వర్యరాయ్ తో కలిసి నటించడం అనేది నా డ్రీమ్. మా నాన్న మూవీ ‘ఆ అబ్ లౌత్' (ఈ సినిమాలో ఐశ్వర్య నటించింది) సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాను. అప్పుడు ఆమెను చూసినపుడు ఎంతో నచ్చింది. కేవలం ఆమె లుక్ గురించి నేను మాట్లాడటం లేదు. ఆమె బిహేవియర్, క్రమశిక్షణ అన్నీ నాకు బాగా నచ్చాయి. అప్పుడే నాతో ఒక మంచి ఫ్రెండ్ లా మాట్లాడింది. అప్పటి నుండి మా మధ్య స్నేహం ఉంది అని రణబీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇపుడే హాటుగా ఉంది

ఇపుడే హాటుగా ఉంది

అప్పటికీ ఇప్పటికీ ఐశ్వర్యలో ఏమీ మార్పు రాలేదు. అప్పటికంటే ఇప్పుడు చాలా హాట్ గా ఉన్నారామె. ఓ ప్రశ్నకు రణబీర్ సమాధానం ఇస్తూ... ఆమె అందం గురించి, ఆమె అచీవ్మెంట్స్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆ విషయాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అని రణబీర్ చెప్పుకొచ్చారు.

ఐశ్వర్యరాయ్-రణబీర్

ఐశ్వర్యరాయ్-రణబీర్

ఐశ్వర్యరాయ్-రణబీర్ కపూర్ గతంలో ఎప్పుడూ కలిసి రొమాంటిక్ గా నటించలేదు. సినిమాలో అసలు ఏం చూపిస్తారో తెలియదు కానీ... ప్రేక్షకులంతా ఈ హాట్ పెయిర్ రొమాన్స్ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

అదిరింది

అదిరింది

ఇటీవల విడుదలైన సాంగ్, తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాలో మేజర్ హైలెట్ వీరి మధ్య సాంగే రొమాంటిక్ సీన్లే అని స్పష్టం అవుతుంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం.

పదేళ్ల గ్యాప్

పదేళ్ల గ్యాప్

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఐశ్వర్య రాయ్ ఇలా తెరపై హాట్ లుక్ లో కనిపిస్తోంది. చాన్నాళ్ల తర్వాత తాము కోరుకునే విధంగా... అందాల సుందరి కనువిందు చేస్తోందని, సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని అభిమానులు అంటున్నారు. 42 ఏళ్ల వయసున్న ఐష్ తనకంటే దాదాపు 10 సంవత్సరాల చిన్నవాడైన రణబీర్ తో రొమాన్స్ చేస్తుండటం సినిమాకు మరో హైలెట్.

స్పార్క్

స్పార్క్

ఐశ్వర్యరాయ్ లో చాలా మంది ఇష్టపడేది ఆమె కళ్లే. ఆ చూపుల్లో మెరుపు ఎక్కడో హార్ట్ ను టచ్ చేస్తున్నట్లు ఉంటుంది. బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ కంటే అందమైన కళ్లు మరే హీరోయిన్ కు లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.

అంకె మాత్రమే

అంకె మాత్రమే

ఐశ్వర్యరాయ్ ని చూసిన ఎవరికైనా ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే... అనే భావన కలుగక మానదు. ఈ వయసులోనూ తన అందాన్ని ఏ మాత్రం చెక్కు చెదరకుండా మెయింటేన్ చేయడం కేవలం ఐశ్వర్యరాయ్ కి మాత్రమే చెల్లింది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

‘యే దిల్ హై ముష్కిల్ ' చిత్రాన్ని అక్టోబర్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క శర్మ, ఫవాద్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Check out Ranbir Kapoor, Aishwarya Rai’s 18 year old image. 18 years when Aishwarya was a beauty queen just starting on her Bollywood career and Ranbir was a chubby, cute teenager. She was a Bollywood novice and he was years away from his Bollywood career. The film was Aa Ab Laut Chalein, which was the directorial debut of Rishi Kapoor and starred Akshaye Khanna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu