షాక్: ఐశ్వర్యరాయ్ సినిమా కోసం చిక్కి శల్యమయ్యాడు (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: పాకిస్థాన్ జైల్లో ఇరవైమూడు సంవత్సరాల పాటు బందీగా వుండి హత్యకు గురైన భారతీయ ఖైదీ సరబ్జీత్‌సింగ్ నిజ జీవితకథతో దర్శకుడు ఓమంగ్‌కుమార్ (మేరీకోమ్ ఫేమ్) ‘సరబ్జీత్‌' చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

ఈ సినిమా కోసం రణదీప్ హుడా ఎంత కష్టపడుతున్నాడో తాజాగా విడుదలైన ఫోటోస్ చూస్తే స్పష్టమవుతుంది. ఇంతకు ముందు రణదీప్ హుడా కాజల్ తో నటించిన ‘దో లబ్జోంకి కహాని' సినిమాలో పాత్ర కోసం 94 కేజీల బరువు పెరిగాడు. తాజాగా ‘సరబ్జీత్‌' చిత్రం కోసం రణదీప్ ఏకంగా 18 కేజీల బరువు తగ్గాడు. కేవలం 28 రోజుల్లో అతడు ఇంత భారీగా బరువు తగ్గడం విశేషం. డాక్టర్ అయిన తన సోదరి పర్యవేక్షణలో రణదీప్ హుడా బరువు తగ్గాడు.

ఇందకు సంబంధించిన ఫోటోలు రణదీప్ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు. ఈ ఫోటోస్ చూసిన వారంతా షాకవుతున్నారు. ఈ పాత్ర కోసం ఒకరంగా రణదీప్ చిక్కి శల్యమయ్యాడనే చెప్పొచ్చు. చూడటానికి భయంకరంగా ఉన్న రణదీప్ హుడా ఫోటోలు స్లైడ్ షోలో చూడండి.

1990 సంవత్సరంలో మద్యం మత్తులో పాకిస్థాన్ భూభాగంలోకి ప్రశేశించిన సరబ్జీత్‌సింగ్ ను భారతీయ గూఢచారిగా అనుమానించిన పాక్‌సైన్యం జైల్లో నిర్భందించింది. లాహోర్ జైల్లో 23 సంవత్సరాల పాటు వున్న సరబ్జిత్‌ను భారత పార్లమెంట్‌పై దాడిచేసిన అఫ్జల్‌గురు మరణశిక్షకు ప్రతీకారంగా సహచర ఖైదీలు రెండేళ్ల క్రితం జైల్లోనే హత్య చేశారు. సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

సరబ్జీత్‌

సరబ్జీత్‌


సరబ్జీత్‌ చిత్రంలో రణదీప్ హుడా ఇలా చిక్కిపోయిన కనిపించబోతున్నాడు.

అంతకు ముందు..

అంతకు ముందు..


అంతకు ముందు రణదీప్ ‘దో లబ్జోంకి కహాని' సినిమా కోసం ఇలా 94 కేజీల బరువు ఉండేవాడు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్


ఇందులో సరబ్జీత్‌సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా నటిస్తున్నాడు. ఆమె సోదరి దల్బీర్‌కౌర్ పాత్రలో ఐశ్వర్యరాయ్ మెయిన్ రోల్ చేస్తోంది.

దల్బీర్‌కౌర్

దల్బీర్‌కౌర్


సరబ్జీత్‌సింగ్ జైల్లో ఉండగా కలిసి వచ్చిన ఆయన సోదరి దల్బీర్‌కౌర్ అక్కడ జైల్లో తన సోదరుడు పడ్డ నరకయాతనను స్వయంగా చూసింది. ఆమె అనుభవాలే కథాంశంగా సినిమా రాబోతోంది.

రీచా చద్దా

రీచా చద్దా


ఈ చిత్రంలో సరబ్జీత్‌ భార్య పాత్రలో రీచా చద్దా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X