మరో సంచలనం: రూ. 175 కోట్లు వసూలు చేసిన ‘రంగస్థలం’
రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' మూవీ మరో సంచలనం సృష్టించింది. నాన్ బాహుబలి కేటగిరీలో ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా అందుకోని హైట్స్‌ను ఈ చిత్రం రీచ్ అయింది. 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 175 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ద్వారా రామ్ చరణ్ కెరీర్లో మాత్రమే కాదు ఓవరాల్ తెలుగు సినిమా చరిత్రలోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఏ సినిమాకు రానంత రెస్పాన్స్ ...
ఇప్పటి వరకు తెలుగులో ఏ సినిమాకు రానంత రెస్పాన్స్ ‘రంగస్థలం' సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి ఇంత ఆదరణ లభించడానికి కారణం ఈ చిత్రం కథ మన తెలుగు నేల మూలాల్లో నుండి రావడమే. అందుకే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. దర్శకుడు సుకుమార్ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను 3 గంటల పాటు సీటుకు అతుక్కుపోయేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు.

మరిన్ని వసూళ్ల దిశగా ‘రంగస్థలం'
కేవలం 16 రోజుల్లోనే ‘రంగస్థలం' చిత్రం ఇంత అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా ప్రదర్శితం అవుతున్న చోట్లా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూనే ఉంది. లైఫ్ టైమ్ రన్‌లో రూ. 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

టాలీవుడ్ టాప్ 10 గ్రాస్
- బాహుబలి 2: రూ. 1706.50 కోట్లు
- బాహుబలి: రూ. 600 కోట్లు
- రంగస్థలం: రూ. 175 కోట్లు
- ఖైదీ నెం 150 : రూ. 164 కోట్లు
- మగధీర : రూ. 150 కోట్లు
- శ్రీమంతుడు : రూ. 144.55 కోట్లు
- జనతాగ్యారేజ్ : రూ. 134.80 కోట్లు
- అత్తారింటికి దారేది: రూ. 131 కోట్లు
- జై లవ కుశ : రూ. 130.90 కోట్లు
- సరైనోడు: రూ. 127 కోట్లు

దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్
‘రంగస్థలం' చిత్రం రూ. 175 కోట్ల మార్కును రీచ్ కావడంపై ఆనందం వ్యక్తం చేస్తూ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











