»   » యూఎస్‌లో చిట్టిబాబు దుమారం.. రంగస్థలం గురించి పవన్ మాట అక్కడ పడింది!

యూఎస్‌లో చిట్టిబాబు దుమారం.. రంగస్థలం గురించి పవన్ మాట అక్కడ పడింది!

Subscribe to Filmibeat Telugu
Rangasthalam Crossed Million Mark, Career Best Openings For Charan

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకునిపోతోంది. రాంచరణ్ తన నటనతో మెస్మరైజ్ చేసాడని అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. చిట్టిబాబుగా రాంచరణ్ పెర్ఫామెన్స్ వర్ణనాతీతమైనది. సుకుమార్ మరో మారు తనదైన మార్క్ ని రంగస్థలం చిత్రం ద్వారా చూపించాడు. సమంత, ఆది పినిశెట్టి మరియు జగపతి బాబు వంటి నటుల నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. రంగస్థలం చిత్రం తొలిరోజు భారీ వసూళ్ళని సాధించినట్లు తెలుస్తోంది. రాంచరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిగర్స్ గా రంగస్థలం ఓపెనింగ్స్ నమోదయ్యాయని అంటున్నారు. యుఎస్ లో అయితే రంగస్థలం వసూళ్లు సునామి సృష్టిస్తున్నాయి. తొలిరోజే ఈ చిత్రం మిలియన్ డాలర్ మార్క్ ని అలవోకగా దాటేయడం విశేషం.

రంగస్థలం మానియా

రంగస్థలం మానియా

రంగస్థలం మానియా ప్రస్తుతం మెగా అభిమానులని ఊపేస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

సుకుమార్ టేకింగ్ అదుర్స్

సుకుమార్ టేకింగ్ అదుర్స్

తన చిత్రాలలో ఎప్పుడూ ప్రత్యేకత చూపించే సుకుమార్ మరోమారు అద్భుతమైన మ్యాజిక్ చేసాడు. రంగస్థలం చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించిన తీరుకు ప్రశంసలు దక్కుతున్నాయి. రాంచరణ్ వంటి స్టార్ హీరోతో ఈ తరహా సబ్జెక్టు చేయడం సాహసమే. ఆ సాహసాన్ని సుక్కు విజయవంతంగా అధికమించాడు.

కలెక్షన్ల వర్షం

కలెక్షన్ల వర్షం

రంగస్థలం చిత్రం యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు ప్రవాహంలా వస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రాంచరణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదలైనట్లు తెలుస్తోంది.

యూఎస్‌లో సునామి

యూఎస్‌లో సునామి

యూఎస్ ఆడియన్స్ రంగస్థలం చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయినట్లు ఉన్నారు. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. తొలిరోజు ముగిసేసమయానికి అలవోకగా మిలియన్ మార్కు అందుకుంది. తొలి రోజు ఈ చిత్రం 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేయడం విశేషం. రెండవరోజు సులభంగా రెండు మిలియన్ల వసూళ్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రశంస

రంగస్థలం చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంస లభించింది. పీకే క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ రాంచరణ్ ని, రంగస్థలం చిత్ర యూనిట్ ని ప్రశంసించాడు. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడని పీకే క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.

English summary
Rangasthalam movie reached one million mark with in no time. Career best openings for Ram Charan
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X