»   » నిలిచిపోనున్న రంగస్థలం చిత్ర ప్రదర్శన.. ఆ గొడవలే కారణం!

నిలిచిపోనున్న రంగస్థలం చిత్ర ప్రదర్శన.. ఆ గొడవలే కారణం!

Subscribe to Filmibeat Telugu

బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం చిత్ర డ్రీమ్ రన్ కొనసాగుతోంది. విడుదలైన అన్ని ఏరియాల్లో రంగస్థలం చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రలో రంగస్థలం చిత్రం ఇప్పటికే 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది. ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగిలిన ఏరియాలలో కూడా కళ్ళు చెదిరే వసూళ్లు దక్కుతున్నాయి. కాగా రంగస్థలం చిత్ర ప్రదర్శనకు ఈ ఆదివారం నుంచి స్వల్ప అంతరాయం ఏర్పడనున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడులో డిజిటల్ ప్రొవైడర్లకు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ తన ఆందోళనని మరింత ఉదృతం చేయనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా తమిళ చిత్రాల ప్రదర్శన తమిళనాడులో ఆగిపోయిన సంగతి తెలిసిందే. పరభాషా చిత్రాలు ప్రదర్శన జరుగుతోంది. వాటిని కూడా నిలిపివేయాలని తమిళ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది.

Rangasthalam movie shows will stops from Sunday

దీనితో ఈ ఆదివారం నుంచి చెన్నై మరియు తమిళనాడులోని ఇతర ఏరియాలలో రంగస్థలం చిత్ర ప్రదర్శన నిలచిపోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రంగస్థలం చిత్ర యూనిట్ కు ఇది కొంత నిరాశ కలిగించే అంశమే అయినా తొలివారంలో దాదాపుగా వసూళ్లు వచ్చేస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు.

English summary
Rangasthalam movie shows will stops from Sunday. Tamil producer council will strengthen their protest
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X