»   » పవన్ రికార్డులు చెల్లాచెదురు.. రంగస్థలం దెబ్బ గట్టిగానే కొట్టిందే..

పవన్ రికార్డులు చెల్లాచెదురు.. రంగస్థలం దెబ్బ గట్టిగానే కొట్టిందే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
రంగస్థలం రికార్డు స్థాయి బిజినెస్ తో పెరిగిన హైప్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దృష్టంతా ప్రస్తుతం రంగస్థలం చిత్రం మీదే ఉంది. మెగా పవర్‌స్టార్ రాంచరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. రంగస్థలం చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ట్రేడ్ వర్గాలకు ముచ్చెటమలు పట్టిస్తున్నాయి. సీడెడ్‌లో ఈ చిత్రం అనూహ్యమైన బిజినెస్ చేయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భారీస్థాయిలో రంగస్థలం

భారీస్థాయిలో రంగస్థలం

దర్శకుడు సుకుమార్ రూపొందించిన చిత్రాలను, రాంచరణ్ నటించిన సినిమా బిజినెస్‌లను పోల్చుకొంటే రంగస్థలం చిత్రం భారీస్థాయిలో వ్యాపారం చేస్తున్నది. మిగితా ఏరియాలో కూడా రికార్డు స్థాయి బిజినెస్ జరుగుతున్నట్టు సమాచారం.

సీడెడ్‌లో రికార్డుస్థాయిలో

సీడెడ్‌లో రికార్డుస్థాయిలో

ట్రేడ్ అనలిస్తుల రిపోర్టు ప్రకారం.. రంగస్థలం సినిమా సీడెడ్ థియేట్రికల్ హక్కులను ప్రముఖ పంపిణీదారుడు రూ.12.1 కోట్లకు దక్కించుకొన్నట్టు సమాచారం. దాంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది.


 పవన్ కల్యాణ్ రికార్డును

పవన్ కల్యాణ్ రికార్డును

బాహుబలిని పక్కన పెడితే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రం రూ.11.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమాను మినహాయించి మిగిత చిత్రాల బిజినెస్‌ను పరిశీలిస్తే ఏ సినిమా కూడా రూ.10 కోట్లకు మించి బిజినెస్ చేయలేదనేది ట్రేడ్ వర్గాల సమాచారం.


 రాంచరణ్ సినిమా బిజినెస్

రాంచరణ్ సినిమా బిజినెస్

కానీ రాంచరణ్ నటించిన రంగస్థలం రూ.12.1 కోట్లకుపైగా వసూలు చేయడం ఈ సినిమా స్టామినాను చెప్పుతున్నదనే మాట వినిపిస్తున్నది. పవన్ కల్యాణ్‌ సినిమాను మించి రాంచరణ్ సినిమా బిజినెస్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.


నైజాంలో 20 కోట్లు

నైజాంలో 20 కోట్లు

ఇక నైజాం విషయానికి వస్తే రంగస్థలం చిత్రం దాదాపు 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది. నైజాంలో మెగా ఫ్యాన్స్ క్రేజ్ ఎక్కువగా ఉండటంతో భారీ మొత్తాన్ని చెల్లించి థియట్రికల్ హక్కులను దక్కించుకొన్నట్టు తెలుస్తున్నది.


మార్చి 30న విడుదల

మార్చి 30న విడుదల

రాంచరణ్, సమంత, జగపతిబాబు తదితరులు నటించిన రంగస్థలం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. 1980 నాటి పరిస్థితుల కథాంశం, నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


English summary
Director Sukumar took the opportunity to take the audience back to the 80s with Rangasthalam 1985. This film features Ram Charan, Samantha Akkineni, Aadhi Pinisetty, Anasuya Bharadwaj and Jagapati Babu in the lead roles. Ram Charan will be seen essaying the role of Chitti Babu in this film. In Nizam and Ceded regions, the rights have been for approximately Rs. 30 crores. This shows the demand graph of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu