»   » మరీ బెగ్గర్స్ తో పోల్చేసిందేంటి?

మరీ బెగ్గర్స్ తో పోల్చేసిందేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : 'యాక్టర్స్ అంటే బెగ్గర్స్ లాంటివాళ్లమే. ఎవరినీ డిమాండ్ చేయలేం. కానీ, దర్శక, నిర్మాతలు మమ్మల్ని సెలెక్ట్ చేసుకునేలా ఉండగలగాలి' అంటోంది రాణి ముఖర్జీ. ఇది విన్న బాలీవుడ్ జనం...ఇదేంటి రాణి ముఖర్జీ ఇలా మాట్లాడింది..ఏకంగా బెగ్గర్స్ పోల్చిందేంటి...మనకా ఖర్మ ఏంటి అన్న రీతిలో కామెంట్స్ చేసుకుంటున్నారు. ఆమె ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదో కానీ బాలీవుడ్ జనం మాత్రం నెగిటివ్ గా తీసుకుంటున్నారు. ఆమె మరీ అలా అనకండా ఉండాల్సింది అంటున్నారు.

అలాగే... 'లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రావడం, సక్సెస్ కావడం శుభపరిణామం. మంచి కథాబలముంటే ఈ తరహా సినిమాలు చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధమే' అని చెప్పింది. ఇటీవల తను ప్రధాన పాత్రలో నటించిన 'మర్దానీ' చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పై విధంగా స్పందించింది రాణీ ముఖర్జీ. 'మర్దానీ' కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమానే. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నాయి.

Rani Mukerji says We actors are like beggars

రాణిముఖర్జీకి ఆదిత్య చోప్రా తో ఈ మధ్యనే వివాహమైంది. ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ...సహజీవనం వరకు వెళ్లింది. వీరిద్దరు గత కొంతకాలంగా కలిసే ఉంటున్నారు. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు కూడా వీరి సంబంధంపై సంతృప్తిగానే ఉంటున్నారు. గత సంవత్సరం జులై నెలలోనే వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. రాణి ముఖర్జీ చేతికి ఖరీదైన డైమండ్ రింగ్ కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలమయ్యాయి. అయితే పెళ్లి జరిగే వరకు ఈ విషయాన్ని వాస్త గోప్యంగానే ఉంచుతూ వచ్చారు.

వాస్తవానికి వీరి పెళ్లి ఇప్పటికే జరుగాల్సి ఉండగా....యశ్ చోప్రా మరణంతో వాయిదా పడిందని అంటున్నారు. రాణి ముఖర్జీ యష్ రాజ్ ఫ్యామిలీ క్లోజ్ ఉంటూ వస్తోంది. వారింట్లో ఏ కార్యక్రమం జరిగినా...ఏలాంటి సెలబ్రేషన్స్ జరిగినా రాణి తప్పకుండా హాజరవుతుంది. ఆ మధ్య ఆదిత్య చోప్రా తండ్రి యష్ చోప్రా ఆసుపత్రిలో చేరినప్పటి నుండే ఆమె తన ఈవెంట్స్ అన్నీ కాన్సిల్ చేసుకుని దగ్గరుండి చూసుకుందట. ఆయన మరణించిన తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన కుటుంబంతోనే గడిపింది.

English summary
Rani Mukerji would love to be a part of women-oriented movies but feels actors are like beggars as they can’t choose much. Rani Mukerji, who is known for portraying strong roles in her films, is now playing a police officer in upcoming ‘Mardaani’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu