»   » రాణి ముఖర్జీకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..!

రాణి ముఖర్జీకి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విడుదలైన 'నోవన్ కిల్డ్ జెస్సికా" చిత్రంలో రాణి ముఖర్జీ అద్భుతమైన నటనను కనబర్చింది. అంతకుముందు 'బ్లాక్", 'తారారంపమ్" తదితర చిత్రాల్లో రాణి బాగా నటించింది. అందుకే ఆమెను ఎన్నో అవార్డులు వరించాయి అయితే ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డు రాణి ముఖర్జీ ఖాతాలో చేరనుంది.

పది సంవత్సరాల పాటు బాలీవుడ్ ని ఏలిన రాణి ముఖర్జీ కి అరుదైన గౌరవం దక్కనుంది. ఆమె ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కేఅవార్డ్ కు ఎంపిక అయ్యింది. ఆమె తన స్పందన తెలుపుతూ ఇది తనను ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించినందుకు వారికి ఎంతగానో రుణపడి ఉంటాను. నన్ను విమర్శించే వారందరికీ నా పెర్ఫర్మేన్సే సమాధానం చెబుతుంది.

గత కొంతకాలంగా నేను గడ్డు పరిస్థితులని ఎదుర్కున్నాను. నా సినిమాలేవీ విజయాన్ని పొందలేదు. కాని ఏ అవార్డ్ రావటంతో నేను నూతన ఉత్సాహంతో ముందడుగు వేయలనుకున్తున్నాను అని వెల్లడించింది. ఆమె ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సినిమాలో వేశ్యగా అరుదైన పాత్రలో నటిస్తుంది.

English summary
Actress Rani Mukherjee who has ruled Bollywood's Box Office for over a decade and recently gave a come back with her power pack performance in the film No One Killed Jessica, will be honoured with the Dadasaheb Phalke Award this year.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu