»   » ముద్దులిచ్చీ...ఇచ్చీ..ఇచ్చీ అలసిపోయాడట... ఇవి చూస్తే మీరు కూడా... అంతేమరి

ముద్దులిచ్చీ...ఇచ్చీ..ఇచ్చీ అలసిపోయాడట... ఇవి చూస్తే మీరు కూడా... అంతేమరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమాలో క్లిష్టమైన డ్యాన్స్‌ మూమెంట్స్‌ కోసం కష్టపడ్డామనో, రిస్కీ ఫైట్స్‌ కోసం కష్టపడ్డామనో చెబుతుంటారు హీరోలు. అయితే బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ మాత్రం హీరోయిన్‌ పెదాలను ముద్దాడడానికి కష్టపడ్డాడట. ఎంతలా అంటే ముద్దులంటేనే మనోడికి చాలా విసుగొచ్చేసిందట. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న 'బేఫికర్‌' సినిమా మనోడికి ముద్దంటే చేదే అనే నిజాన్ని తెలియపరిచిందట. ఆ సినిమా హీరోయిన్‌ వాణీకపూర్‌ పెదాలను రణ్‌వీర్‌ లెక్కలేనన్ని సార్లు ముద్దాడాడట.

సినిమా పేరు బేఫికర్. అందుకేనేమో ఎటువంటి భయం లేకుండా హీరో హీరోయిన్ లు ఏకంగా 23 లిప్ లాక్ లు లాగించేశారు. రణ్‌వీర్‌సింగ్‌, వాణికపూర్ జంటగా వస్తున్న హిందీ మూవీ బేఫికర్ లో హీరో, హీరోయిన్ లు కలిసే ప్రతి సన్నివేశంలోనూ ఒక ముద్దు సీన్ పెట్టేశాడు దర్శకుడు.. ఫస్ట్‌లుక్ అంటూ విడుదల చేసిన మూడు పోస్టర్లలో ముద్డుల తప్ప ఇంకేం కనిపించడం లేదు.. ఈ మూవీకి అదిత్య చోప్రా దర్శకుడు.. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రణ్ వీర్ గోల మరొకటి ఉంది ముద్దులంటేనే విరక్తి పుట్టిందట..ముద్దంటే ఎందూ విరక్తీ అంటే అదెంత టార్చరో చెప్పుకొచ్చాడు.

ముద్దులే ముద్దులు:

ముద్దులే ముద్దులు:

వామ్మో.! మరీ అన్ని ముద్దులా, అలసిపోయాం బాబూ.. అని అంటున్నాడు రణ్ వీర్ సింగ్. ఆఖరికి ముద్దులంటేనే విసుగు వచ్చేసింది... ఈ సినిమా కోసం అంతలా కష్టపడ్డాం. సెట్ లోకి అడుగు పెట్టింది మొదలు.. ముద్దులే ముద్దులు! పై పెదవి మీద మొదట, ఆ వెంటనే కింది పెదవి అందుకోవాలి..

శరీరం అలిసిపోయింది:

శరీరం అలిసిపోయింది:

ఆ పై సుధీర్ఘ మైన చుంబనాలు... ఒక యాంగిల్ లో కాదు, డిఫరెంట్ యాంగిల్స్ లో... దీంతో శరీరం అలిసిపోయింది.. "బేఫికర్'' సినిమాలో హీరోయిన్ వాణీకపూర్ తో సాగించిన ముద్దులాట గురించి ఈ విధంగా వివరిస్తున్నాడు.

 ముద్దులు పెట్టీ పెట్టీ:

ముద్దులు పెట్టీ పెట్టీ:

‘సెట్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. ముందు పై పెదవిని ముద్దాడాలి.. ఆతర్వాత కింద పెదవి.. ఆపై సుదీర్ఘంగా చుంబించుకోవాలి.. ఒక్క యాంగిల్లో కాదు.. రకరకాల యాంగిల్స్‌లో.. నిజంగా ముద్దులు పెట్టీ పెట్టీ చాలా అలసిపోయాను. ఇక, ఇప్పట్లో ముద్దు సీన్లు ఉండే సినిమాలను అంగీకరించన'ని తేల్చిచెప్పేస్తున్నాడు రణ్‌వీర్‌.

టైటిల్‌కి తగ్గట్టు:

టైటిల్‌కి తగ్గట్టు:

"బేఫికర్" అంటే నిశ్చింతగా ఉండటం అని అర్థం. టైటిల్‌కి తగ్గట్టు నిశ్చింతగా గాల్లో ఎగురుతూ ప్రియుడి పెదాలపై ఓ ముద్దు.. డ్యాన్స్ చేస్తూ మరో ముద్దు.. బీచ్‌లో ఇంకో ముద్దు.., , ప్యారిస్ నగరం అంతా కనబడేలా ఓ బిల్డింగ్ టై మీద కూర్చుని మళ్లీ ముద్దు..

కళాత్మక దృష్టి:

కళాత్మక దృష్టి:

ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్‌లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఏంటీ ముద్దులు? అని ఎవరైనా అడిగితే.. కళాత్మక దృష్టితో చూడండని సలహా కూడా ఇచ్చారు చిత్రబృందం.

వాణీ కపూర్ బర్త్‌డే :

వాణీ కపూర్ బర్త్‌డే :

ఇప్పటివరకూ విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ ముద్దుకి సంబంధించినవే., , వాణీ కపూర్ బర్త్‌డే సందర్భంగా లిప్‌లాక్ లేకుండా ఓ స్టిల్ రిలీజ్ చేసేసరికి షాకవ్వడం ప్రేక్షకుల వంతైంది. నార్మల్‌గా లిప్‌లాక్ స్టిల్స్ ఆడియన్స్‌లో డిస్కషన్స్‌కి కారణం అవుతాయి.

 ప్రతి ముద్దుకీ కథ:

ప్రతి ముద్దుకీ కథ:

బట్ ఫర్ ఎ చేంజ్.. ఈసారి ముద్దు పెట్టుకోలేదా ఏంటీ? అంటూ రివర్స్‌లో ఆడియన్స్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో మొత్తం 23 ముద్దులున్నాయట. ప్రతి ముద్దుకీ కథలో ప్రాముఖ్యత ఉంటుందట.

 23 లిప్ కిస్ లు:

23 లిప్ కిస్ లు:

ఈ 23 లిప్ కిస్ ల కోసం.. రణ్ వీర్ ఎన్ని టేకులు తీసుకున్నాడో.. వాణి కపూర్ ఎన్ని ముద్దులు లాగించిందో కౌంటింగ్ బాగా కష్టమైపోతోందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ బేఫికర్ ని ముద్దులతో నింపేశారనే మాట అయితే వాస్తవమే.

ముద్దు సీన్లకు కొదువే లేదు:

ముద్దు సీన్లకు కొదువే లేదు:

మరి ఇన్ని లిప్ లాక్ లను చూసి ఎంజాయ్ చేసేద్దామంటే మాత్రం అప్పుడే కుదరదు. దానికి ఇంకా నెల టైం ఉంది. డిసెంబర్ 9న బేఫికర్ రిలీజ్ కు డేట్ లాక్ చేసుకున్నారు.ఈ సినిమాలో ముద్దు సీన్లకు కొదువే లేదు.

 ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ :

ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ :

మొత్తంగా చెప్పాలంటే రోమాన్స్ సీన్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ప్రపంచంలోని చరిత్ర ప్రసిద్ధమైన కట్టడాల్లో ఒకటైన ఈపిల్ టవర్ వద్ద ట్రైలర్ విడుదల చేసిన తొలి భారతీయ చిత్రంగా బేఫికర్ నిలిచింది. బయటి ప్రపంచానికి ఏమాంతం భయపడకుండా ఇద్దరు యువతీ యువకులు తమకు నచ్చింది ఎలా చేశారని కథాంశంతో ఈ సినిమా రానుంది.

English summary
After the success of Bajirao Mastani, Ranveer Singh, is set for another romantic-drama movie, Befikre, which is set to hit the silver screens on this December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu