»   » రొమాంటిక్ హీరోతో సచిన్ కూతురు... సోషల్ మీడియాలో ఫోటోస్ హల్ చల్!

రొమాంటిక్ హీరోతో సచిన్ కూతురు... సోషల్ మీడియాలో ఫోటోస్ హల్ చల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా....ఇతర సెలబ్రిటీల పిల్లల్లా బయట కనిపించడం చాలా అరుదు. అయితే తాజాగా సారా బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తో కలిసి పార్టీలో పాల్గొన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సారా చాలా లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తుంటుంది. ఏవైనా స్పెషల్ ఈవెంట్స్, లేదా తండ్రి ఆడే మ్యాచుల్లో తప్ప ఆమె బయట కనిపించడం చాలా అరుదు. సోషల్ మీడియాకు సారా చాలా దూరం. అలాంటి సారా బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ రణవీర్ సింగ్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ చిల్ అవ్వడం చూసి అంతా ఆశ్చర్య పోతున్నారు.

సారా టెండూల్కర్

సారా టెండూల్కర్

సారా టెండూల్కర్ వయసు ప్రస్తుతం 19 సంవత్సరాలు. సారా ప్రస్తుతం తన స్టడీస్ మీదనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ముంబైలో సెలబ్రిటీ పార్టీలో వీరిద్దరూ కలిసి ఉంటారని భావిస్తున్నారు.

సారా మీద రూమర్స్

సారా మీద రూమర్స్

2015లో సారా సినిమాల్లోకి వస్తుందనే రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో సారా టెండూల్కర్ హీరోయిన్ గా నటించబోతోందనే వార్తులు వచ్చాయి.

సారా మీద రూమర్స్

అయితే సచిన్ టెండూల్కర్ వెంటనే తన కూతురు మీద వచ్చిన వార్తలను ఖండించారు. సారా సినిమాల్లోకి వస్తుందనే వార్తలు పూర్తిగా ఆధారం లేనివే అంటూ ట్వీట్ చేసారు.

సచిన్ మూవీ

సచిన్ మూవీ

సినిమా ప్రపంచానికి వీలైనంత దూరంగా ఉండే సచిన్ ... తన జీవిత కథతో వస్తున్న సినిమాలో తానే నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాని లండన్ బేస్డ్ పిల్మ్ మేకర్ జేమ్స్ ఎర్క్సిన్ దర్శకత్వం వహిస్తున్నారు. మే 26, 2017న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

English summary
Sara Tendulkar is one of the rare celebrity kids who stays off the radar. However, a picture of the 19-year-old chilling with actor Ranveer Singh has surfaced on social media, and boy, she has grown up to be quite the beauty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu