»   » మాజీ సీఎం తో కలిసి హీరో డాన్స్ (వీడియో)

మాజీ సీఎం తో కలిసి హీరో డాన్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ యంగ్ హీరో రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా ఓ పాటకు స్టెప్పులేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ వార్తా ఛానెల్‌ ఎన్డీటీవీ గత రాత్రి నిర్వహించిన ‘ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డుల కార్యక్రమానికి ఫరూక్‌ అబ్దుల్లా ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

కార్యక్రమంలో భాగంగా రణ్‌వీర్‌సింగ్‌కి ‘ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు' ప్రకటించారు. ఈ అవార్డును రణ్‌వీర్‌కి ఫరూక్‌ అబ్దుల్లా ప్రదానం చేయాల్సిందిగా వ్యాఖ్యాత కోరారు. దీంతో అవార్డు ప్రదానం చేయడానికి వచ్చిన ఫరూక్‌.. సరదాగా రణ్‌వీర్‌తో కలిసి ‘బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలోని ఓ పాటకు డ్యాన్స్‌ చేశారు. దీంతో సభా ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది.

అంతేకాదు.. మీరు కనుక నటుడు అయ్యుంటే.. అమితాబచ్చన్‌కి ఇబ్బందిగా ఉండేది అంటూ రణ్‌వీర్‌ ఫరూక్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా.. ‘తనకు నటన అంటే ఇష్టమని.. ఈ జన్మలో కుదరలేదని.. వచ్చే జన్మలో ప్రయత్నిస్తానంటూ' ఫరూక్‌ చెప్పడం విశేషం.

English summary
Actor Ranveer Singh has new competition with the grand old man of Jammu and Kashmir politics, the 78-year-old former chief minister Farooq Abdullah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu