»   »  'హర హర మహాదేవ్‌' అంటూ హీరో దండయాత్ర

'హర హర మహాదేవ్‌' అంటూ హీరో దండయాత్ర

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మరాఠా యోధుడు బాజీరావ్‌ పీష్వా థియేటర్లపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పోస్టర్ ని ఈ రోజు విడుదల చేసారు. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రాలు ప్రధాన పాత్రల్లో సంజయ్‌ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన 'బాజీరావ్‌ మస్తానీ' చిత్రంలో బాజీరావ్‌పీష్వా దండయాత్రకు బయలుదేరిన ఓ కొత్త పోస్టర్‌ని చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది.

ఈ పోస్టర్‌ని రణ్‌వీర్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ.. 'హర హర మహాదేవ్‌' అంటూ సమరనినాదం చేశారు. ఈ సినిమా డిసెంబర్‌ 18న విడుదల కానుంది.

 Ranveer Singh Proudly presenting Sanjay Leela Bhansalis magnum opus....BAJIRAO MASTANI

మరో ప్రక్క...

18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా ‌, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'బాజీరావ్‌ మస్తానీ'. రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో, సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చారిత్రక సినిమాకి ఓ అడ్డు వచ్చి పడింది. 'బాజీరావ్‌ మస్తానీ' సినిమాకు వ్యతిరేకంగా బాజీరావ్ కుటుంబం నుండి మహరాష్ట్ర్ర ప్రభుత్వానికి లెటర్ అందింది.

ఆ లెటర్ లో మహరాష్ట్ర్ర ముఖ్యమంత్రి 'దేవేంద్ర ఫడ్నవీస్'కి బాజీరావ్ కుటుంబానికి చెందిన ప్రసాద్ రావ్ పేష్వా, వాస్తవ చరిత్రని పాడు చేసేవిదంగా ఉందని, సంజయ్‌ లీలా భన్సాలీ వాస్తవ చరిత్రని మార్చినందుకు, నేరాన్ని గుర్తించి ఈ విషయాన్ని పరిగణనలోకి తిసుకోవాలని విన్నవించుకున్నారు.

ఈ ఉత్తారాన్ని గనుక మహరాష్ట్ర్ర ప్రభుత్నం పరిగణలోకి తిసుకోంటే డిసెంబర్ 18న రిలీజ్ అవ్వల్సినా ఈ సినిమా కష్టాల్లో పడినట్లే...ఎం జరుగుతుందో చూడల్సిందే అని బాలీవుడ్ ఆసక్తిగా చూస్తోంది.

English summary
Ranveer Singh Proudly presenting Sanjay Leela Bhansalis magnum opus....BAJIRAO MASTANI !!!!!
Please Wait while comments are loading...