గూని బాబ్జి .. మరో ఛాలెంజింగ్ పాత్రలో రావు రమేష్

సీనియర్ నటుడు రావు గోపాల్ రావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రావ్ రమేష్ ఇండస్ట్రీలోకి చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైమ గుర్తింపు అందుకున్నాడు. ఎలాంటి పాత్ర చేసినా కూడా ఒక డిఫరెంట్ బాడీ లంగ్వేజ్ తో సినిమాలోని హైలెట్ అయ్యేలా చేస్తారు. కొత్త బంగారు లోకం లెక్చరర్ పాత్ర నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని పాత్రల్లో ఏదో ఒక కొత్తం ధనం ఉండేలా చూసుకున్నారు.

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా రావు రమేష్ నటన మాత్రం అద్భుతం అనేలా పేరు తెచ్చుకుంటు వస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రావు రమేష్ మరొక ఛాలెంజింగ్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. మహాసముద్రం సినిమాలో ఒక గూని వాడిగా బాబ్జి అనే పాత్రలో నటించారు. ఇక నేడు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయగా రావు రమేష్ విభిన్నమైన హావభావాలతో ఆకట్టుకున్నాడు.

Rao Ramesh As Gooni Babji From Maha Samudram

ఇక మహాసముద్రం సినిమా విషయానికి వస్తే.. ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ - సిద్దార్థ్ కలిసి నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే అంచనాల డోస్ పెంచిన చిత్ర యూనిట్ ఇప్పుడు రావ్ రమేష్ పోస్టర్ తో మరింత బజ్ క్రియేట్ చేసింది. ఒక విభిన్నమైన ప్రేమకథగా రాబోతున్న ఈ మూవీలో హీరోయిన్స్ గా అదితి రావ్ హైదారి, అను ఇమ్మాన్యుయేల్‌ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X