»   » ఉదయ్ కిరణ్ : జీవిత విశేషాలు (మీరు చూడని ఫోటోలతో)

ఉదయ్ కిరణ్ : జీవిత విశేషాలు (మీరు చూడని ఫోటోలతో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :వజపయాజుల ఉదయ్ కిరణ్ ఆత్మ హత్య చేసుకుని మృతి చెందారన్న వార్త తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా అతని గురించే మాటలు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు కూడా అతని మరణ వార్తతో నిండిపోయాయి. ఈ నేపధ్యంలో అతని మరణానికి నివాళి తెలుపుతూ ఉదయ్ కిరణ్ గురించిన వివరాలు తెలుసుకుందాం.

ఉదయ్ కిరణ్ శ్రీనగర్ కాలనీలోని తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జూబ్లిహిల్స్ అపోలో అసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ఉదయ్‌కిరణ్ మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సినీనటులు శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్‌రాజేశ్, శివాజీ, సంగీతదర్శకుడు ఆర్పీపట్నాయక్ అపోలో ఆసుపత్రికి చేరుకుని ఉదయ్‌కిరణ్ మృతదేహాన్ని సందర్శించారు. మృతికి గల కారణాలపై విచారణ జరపాలని శ్రీకాంత్ పోలీసులను కోరారు.

ఫోటోలతో స్లైడ్ షో...

జననం

జననం


ఉదయ్ కిరణ్ 1980 జూన్ 20 న హైదరాబాద్ వివికె మూర్తి, నిర్మల దంపతులకు జన్మించాడు. అతని సోదరి పేరు శ్రీదేవి.

చదువు

చదువు

సికింద్రాబాద్ వెస్లి కాలేజీ నుండి కామర్స్ లో డిగ్రి పట్టా పుచ్చుకున్నాడు. తరువాత మోడలింగ్ చేసి మిస్టర్ aptech గా ఎంపికయ్యారు. దాని తరువాత సినిమా హీరో కావాలని ప్రయత్నం ప్రారంభించాడు.

మొదట సినిమా...

మొదట సినిమా...

2000 సంవత్సారాలకు మునుపే మిస్టీరియస్ గర్ల్ అనే ఓ ఆంగ్ల సినిమాలో అభినవ్ వెలగలేటి దర్శకత్వంలో నటించాడు. ఆ సినిమా విడుదల కాలేదు.

చిత్రం సూపర్ హిట్..

చిత్రం సూపర్ హిట్..


మిస్టీరియస్ గర్ల్ తరువాత తేజ దర్శకుడిగా రూపొందిన "చిత్రం'' సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో కెరీర్ పరంగా దూసుకుపోయారు.

నిశ్చితార్దం..

నిశ్చితార్దం..

2000సంవత్సరంలో కెరియర్ ప్రారంభించి విజయవంతంగా సాగుతున్న తరుణంలో 2003 వ సంవత్సరంలో చిరంజీవి కూతురు తో అతనికి వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల రద్దయింది.

చివరి చిత్రం...

చివరి చిత్రం...

తెలుగు లో ఉదయకిరణ్ చివరి చిత్రం జై శ్రీరాం, తెలుగులో దిల్ కబాడీ అనే సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. మరో తమిళ సినిమా చేయవలసి ఉంది.

అవార్డులు

అవార్డులు

తెలుగు తమిళ భాషల్లో కలసి దాదాపు 21 సినిమాలు చేసిన ఉదయ్ కిరణ్ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డులు నందీ అవార్డులు అందుకున్నారు.

డౌన్ పాల్...

డౌన్ పాల్...

2003వ సంవత్సరం తరువాత అతనికి సినిమా కెరియర్ పరంగా డౌన్ ఫాల్ ప్రారంభమైంది. దాని తరువాత అతనికి సరైన సినిమాలు పడలేదు. చేసిన సినిమాలు సక్సెస్ కాలేదు.

ఫలితం లేదు...

ఫలితం లేదు...

హీరోగా ఓ వెలుగు వెలిగిన ఉదయ్ కిరణ్ తిరిగి హిట్ సాధించడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. అయితే అతనికి సరైన సినిమా దొరక లేదు. వచ్చిన సినిమా హిట్ కాలేదు.

వివాహం...

వివాహం...

2012 అక్టోబర్ లో విషిత తో వివాహమైంది. చనిపోవడానికి ముందు చివరిసారిగా భార్యకు ఐలవ్‌యూ అనే మెసేజ్ చేశాడని క్లూస్‌టీం తెలిపింది.

చివరిగా విషాదం..

చివరిగా విషాదం..

ఉదయ కిరణ్ శ్రీనగర్ కాలనీలో గల తన స్వగృహంలో జనవరి 5 న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. స్నేహితులు బంధువులు మాత్రం అతనికి సినిమాలు లేక మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. వివరాలు తెలయ వలసి ఉంది.

చివరిగా..ఎవరితో...

చివరిగా..ఎవరితో...


ఉదయ్‌కిరణ్ చివరిసారిగా చెన్నైకి చెందిన భూపాల్ అనే వ్యక్తితో మాట్లాడినట్లు సమాచారం. రెండు రోజులుగా ఉదయ్‌కిరణ్ ఇంటి నుంచి బయటకి రానట్లు తెలిసింది. ఉదయ్‌కిరణ్ మృతికి కుటుంబ కలహాలు కారణం కాదని క్లూస్‌టీం ప్రాథమికంగా నిర్ధారించింది.

English summary
Uday Kiran Vajapeyajula (26 June 1980 – 5 January 2014) was an Indian film actor, who primarily worked in the Telugu cinema. Uday Kiran Commits Suicide by Hanging Himself on 5 January 2014.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu