»   » రాశీఖన్నా విలన్ పాత్ర చేస్తోంది..! పిచ్చిగానీ పట్టలేదు కదా

రాశీఖన్నా విలన్ పాత్ర చేస్తోంది..! పిచ్చిగానీ పట్టలేదు కదా

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఊహలు గుసగుసలాడే లో అమాయకంగానూ, హైపర్ లో మరీ సెక్సీగానూ కనిపించిన రాశీ ఖన్నా సాయిధరమ్ తేజ్‌ సుప్రీమ్ లో బెల్లం శ్రీదేవిగా ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో తెలిసిందే. ఇటీవల యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సినిమాలోనూ ఆఫర్ పట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఈ భామ మరో క్రేజీ రోల్‌లో మెరవబోతోంది. హీరోయిన్‌గా అందరినీ మెప్పించిన రాశీ ఖన్నా.. విలన్ పాత్ర చేయబోతోందట.

  మలయాళంలో అరంగేట్రం

  మలయాళంలో అరంగేట్రం

  ఆ పాత్రతోనే మలయాళంలో అరంగేట్రం చేసేస్తోందట.ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ మలయాళంలో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ఓ సినిమా చేస్తుండగా ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కేలా కొత్త ప్లాన్ వేసాడు ఈ సూపర్ స్టార్.

  మూడు ఇండస్ట్రీల నుండి

  మూడు ఇండస్ట్రీల నుండి

  తెలుగు, తమిళం, మలయాళంలో ఈ చిత్రానికి భారీ ఆదరణ లభించాలని మూడు ఇండస్ట్రీల నుండి పలువురు స్టార్స్ ని తన సినిమాకు ఎంపిక చేసుకున్నాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హీరోయిన్ హన్సికలకు మంచి రోల్స్ ఇవ్వగా మరొక తెలుగు స్టార్ హీరోయిన్ రాశి ఖన్నా ఈ ప్రాజెక్టు లో కీలక పాత్ర పోషిస్తుంది.

  ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో

  ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో

  మోహన్‌లాల్ హీరోగా బి.ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో రాశీ ఖన్నాను తీసుకున్నారు. కొన్ని వారాల క్రితమే ఆమెకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తైపోయింది. ఇప్పుడీ సినిమాలో రాశీ ఖన్నా పోషిస్తున్న పాత్ర గురించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది.

  నెగెటివ్‌ క్యారెక్టర్‌

  నెగెటివ్‌ క్యారెక్టర్‌

  స్వభావరీత్యా ఇది నెగెటివ్‌ క్యారెక్టర్‌ అని, చాలా ఛాలెంజింగ్‌గా వుంటుందని తెలిసింది. సుప్రీమ్‌లో పోలీస్‌ గెటప్‌లో రాశిని చూసి ఈ పాత్ర తనకి ఆఫర్‌ చేసారట. అప్పటికంటే ఇప్పుడు బాగా సన్నబడిన రాశి పోలీస్‌ పాత్రకి తగ్గట్టుగా నాజూగ్గా వుంది. ఒక హీరోయిన్‌కి ఇలాంటి పాత్ర రావడం చాలా అరుదు,

  ఎన్టీఆర్‌తో చేస్తే

  ఎన్టీఆర్‌తో చేస్తే

  తనకి కెరియర్‌ ఆరంభంలోనే ఇన్ని వైవిధ్యభరిత పాత్రలు చేసే అవకాశం రావడం అదృష్టమని ఆమె అంటోంది. ఇక ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న రాశి ఈ చిత్రంతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోతాననే నమ్మకంతో వుంది. ఎన్టీఆర్‌తో చేస్తే ఇక స్టార్‌ హీరోలంతా తనని సీరియస్‌గా కన్సిడర్‌ చేస్తారని ఆమె భావిస్తోంది.

  English summary
  After Supreme’s release last year, Raashi Khanna has been busy with shootings of almost five crazy projects in Tollywood. Recently, she was roped in for Jr. NTR’s Jai Lava Kusa as one of the lead actresses and now Raashi is gearing up to make her Malayalam debut in the Mohanlal starrer movie, Villian.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more