»   » ముద్దు సీన్ కోసం రష్మి ఏం చేసిందో తెలుసా?

ముద్దు సీన్ కోసం రష్మి ఏం చేసిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘జబర్దస్త్' కామెడీ షో యాంకర్ రష్మి ‘గుంటూరు టాకీస్' మూవీలో గ్లామర్ పరంగా ఓ రేంజిలో రెచ్చిపోతోంది. ఈ సినిమాకు సంబంధించిన నీ సొంతం... అనే సాంగ్ వీడియో టీజర్ ఇటీవల విడుదలైన తర్వాత కానీ అర్థం కాలేదు రష్మిలో ఇంత విషయం ఉందా? అని. ఇందులో భారీగా ఎక్స్ ఫోజింగ్ చేయడంతో పాటు లిప్ లాక్ సీన్లు కూడా చేసి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది ఈ టీవీ బ్యూటీ.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘గుంటూరు టాకీస్' గురించి రష్మి స్పందిస్తూ.....చాలా కాలంగా ఇలాంటి చాలెంజింగ్ పాత్ర కోసం ఎదురు చూసాను. ఎట్టకేలకు గుంటూరు టాకీస్ చిత్రంలో నేను అనుకున్న విధంగా సువర్ణ పాత్ర చేసే అవకాశం దొరికింది అని చెప్పుకొచ్చింది.


రేష్మి నువ్వేనా?: అడల్ట్ మూవీ చూసినట్లుంది (హాట్ వీడియో)


Rashmi agreed to dating Siddhu

జబర్దస్త్ షో చేస్తున్నపుడే నేను చాలా గ్లామర్ గా కనిపిస్తున్నానని కొందరు కామెంట్ చేసారు. వారు నన్ను గుంటూరు టాకీస్ మూవీలో చూస్తే షాకవుతారు. ఇందులో పాత్ర పరంగా గ్లామర్ కంటెంట్ కాస్త ఎక్కువగా ఉంటుంది అని తెలిపారు.


సినిమాలో లిప్ లాక్ సీన్లు చేయడం స్పందిస్తూ....ఉన్నట్టుండి అలాంటి సీన్లు నేచురల్ గా చేయడం కష్టం. అందుకే సిద్ధు, నేను కొంతకాలం డేటింగ్ చేసాం. ఇద్దరం కలిసి కాఫీషాపుల్లో గడపడం, సినిమాలకు వెళ్లడం చేసాం. ఇద్దరి మధ్య కంఫర్ట్ లెవల్ పెంచుకోవడానికి, నీ కోసం సాంగ్ బాగా రావాలనే ఇలా చేసాం. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఏర్పడిన తర్వాతే ఇద్దరం ఎలాంటి ఇబ్బంది లేకుండా లిప్ లాక్ సీన్ చేయగలిగాం అని రష్మి చెప్పుకొచ్చింది.


ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు వినిపించాయి. అలాంటి ఏమీ లేదు. మేము ఏం చేసినా సినిమా కోసమే చేసాం... వ్యక్తిగతం ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అంతుకు మించి ఏమీ లేదని తెలిపింది. సినిమాల్లో బిజీ అయినా టీవీ ఫీల్డ్ ను వదులుకోనని రష్మి స్పష్టం చేసింది.

English summary
Rashmi agreed to dating Siddhu. But there's a twist. Rashmi and Siddhu dated only to prepare themselves for the steamy hot Nee Sontham song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu