»   » నా వద్ద అంత డబ్బు లేదన్న యాంకర్ రష్మి... పెళ్లి విషయమై దాటవేత!

నా వద్ద అంత డబ్బు లేదన్న యాంకర్ రష్మి... పెళ్లి విషయమై దాటవేత!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో పాపులర్ సెలబ్రిటీగా మారిపోయిన రష్మి.... ఆ తర్వాత సినిమాల్లోనూ, ఇతర టీవీ షోలలోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్నారు. తనకు ఈ స్థాయి రావడానికి, ఇంత పాపులరిటీ రావడానికి అభిమానులే అని బలంగా నమ్మే ఆమె.... వారితో ఎప్పుడూ సోషల్ మీడియాలో టచ్‌లో ఉంటారు. అప్పుడప్పుడూ వారితో సరదాగా చాటింగ్ చేస్తూ వారిని మరింత ఉత్సాహ పరుస్తుంటారు. ఈ చాటింగులో అభిమానులు ఒక్కోసారి కొంటె ప్రశ్నలు, అభ్యంతరకర ప్రశ్నలు సైతం అడుగుతుంటారు. తాజాగా ఆ ప్రశ్నలకు రష్మి ఆసక్తికర సమాధానాలిచ్చారు.

  Anchor Rashmi Gives Strong Counter To Netizen
  నిన్ను పెళ్లి చేసుకోను

  నిన్ను పెళ్లి చేసుకోను

  ఈ ట్విట్టర్ చాట్లో ఓ అభిమాని సరదాగా వేసిన ఓ ప్రశ్న అందరినీ ఆకట్టుకుంది. ‘మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నాకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది, ఒక అందమైన ఇల్లు, స్కూటర్‌ ఉన్నాయి. అంతకు మించి మీపై చాలా ప్రేమ ఉంది?... అని అడగటంతో దానికి రష్మి ‘చేసుకోను' అని సమాధానం ఇచ్చారు.

  సుధీర్ ఇష్యూపై...

  సుధీర్ ఇష్యూపై...

  సుధీర్‌ మీకు ప్రపోజ్‌ చేశారు కదా? ఎందుకు అప్పుడు సమాధానం చెప్పలేదు? అని ఓ అభిమాని అడగటంతో ‘అది నా ఇష్టం' అంటూ తేల్చి చెప్పింది రష్మి. సుధీర్‌ను తాను ప్రేమించడం లేదని తెలిపింది. సుధీర్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నారని ఓ అభిమాని చెప్పడంతో.... ‘అతడు మీకు చెప్పారా?' అంటూ తెలివిగా ఎదురు ప్రశ్నవేసింది.

  సినిమా అవకాశాలపై

  సినిమా అవకాశాలపై

  ఎందుకు సినిమాల్లో కనిపించడం లేదు? అవకాశాలు రావడం లేదా? మీరే దూరంగా ఉంటున్నారా? అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ.... తాను అనుకున్న విధంగా సినిమా అవకాశాలు రావడం లేదని, ఒక వేళ వచ్చినా కొన్ని కథలు నచ్చడం లేదని రష్మి తెలిపారు. ప్రస్తుతం తన చేతిలో ఏ సినిమాలు లేవని తెలిపారు.

  ఎన్టీఆర్ గురించి తెలియదు

  ఎన్టీఆర్ గురించి తెలియదు

  ఎన్టీఆర్‌ గురించి చెప్పండి? అని ఓ అభిమాని ప్రశ్నిచండంతో ఆయన తనకు వ్యక్తిగతంగా తెలియదు. కాబట్టి చెప్పడానికి ఏమీ లేదని రష్మి స్పష్టం చేసింది.

  నా పెళ్లి ఖర్చు మీరు పెడతారా?

  నా పెళ్లి ఖర్చు మీరు పెడతారా?

  మీ పెళ్లి ఎప్పుడు? అని ఓ అభిమాని అడగటంతో..... ‘నా పెళ్లి ఖర్చు మీరు పెడతారా? ' అంటూ దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. మీ పెళ్లి కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం, మీకు ఎలాంటి వరుడు కావాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రష్మి ఇష్టపడలేదు. అది తన వ్యక్తిగత విషయం అని తెలిపింది.

  లవ్ విషయాల గురించి...

  లవ్ విషయాల గురించి...

  మీ జీవితంలో ఎవరూ లేరా? ఎవరినీ ప్రేమించలేదా? అనే ప్రశ్నకు రష్మి రియాక్ట్ అవుతూ.... అది నా వ్యక్తిగత విషయం అని తెలిపారు.

   నా వద్ద అంత డబ్బు లేదు

  నా వద్ద అంత డబ్బు లేదు

  ఒక ఇంటెన్షన్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్‌ మీరు సొంతగా ఎందుకు ప్రారంభించకూడదు. ఇలాంటివి మీకు బాగా సూటవుతుంది, మీ స్టార్ డమ్ పెరుగుతుంది అని ఓ అభిమాని ప్రశ్నించగా.... సొంతగా నిర్మించుకునేంత డబ్బున్న వ్యక్తిని తాను కాదని రష్మి తెలిపారు.

  English summary
  In a recent twitter chat a Rashmi fan asked that, " why don't u start a web series with an intense action thriller one !! Surely it will raise ur stardom because it suits u and u live in the characters !!". "I’m not that rich to produce my own" Rashmi replied.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more