»   » శృంగార సీన్లు, ఐటం సాంగ్స్: అప్పుడు మోస పోయానంటున్న రేష్మి

శృంగార సీన్లు, ఐటం సాంగ్స్: అప్పుడు మోస పోయానంటున్న రేష్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ రష్మి నటించిన 'గుంటూరు టాకీస్' ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మి శృంగార సీన్లు, ముద్దు సీన్లు యమ హాటుగా చేసి అందరూ షాకయ్యేలా చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలపై మాట్లాడారు. భవిష్యత్తులో ఐటం సాంగ్స్ కూడా చేస్తానని తెగేసి చెప్పింది.

టీవీ షోల కంటే ముందు తాను సినిమాల్లోనే చేసానని... అయితే అప్పుడు తనకు గుర్తింపు రాలేదని రష్మి చెప్పుకొచ్చింది. గతంలో సినిమాలు చేసాను, కానీ చాలామంది నన్ను మోసం చేశారు. నాకు కథ చెప్పేది ఒకటి. తీసేది మరొకటిగా ఉండేది. తెర మీద ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా చూపించేవారు. దాంతో లెక్కకు చాలా సినిమాలు చేసినా ఏవీ నాకు బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి అని ఆమె తెలిపారు.


చాలా కాలం తర్వాత ప్రవీణ్‌ సత్తార్‌ గారు చెప్పిన 'గుంటూర్‌ టాకీస్‌' కథ స్టోరీ బాగా నచ్చింది. ఇందులో స్క్రిప్టు డిమాండ్ చేయడంతో కొన్ని శృంగార సన్నివేశాలు చేసారు. ఏదో ఒకటి రెండు సన్నివేశాలు చూసి రెచ్చిపోయి నటించాను అనడం సరి కాదు. సినిమా చూసిన తరువాత చెప్పండి. సినిమాకు ఎంత వరకూ అవసరమో అంత వరకే శృంగార సన్నివేశాలు ఉంటాయి తప్ప మితిమీరి ఉండవు అని రష్మి స్పష్టం చేసింది.


శృంగార సీన్లు చేయడం అంతా సులభం కాదు. తెలియని వ్యక్తులతో రొమాంటిక్‌ సాంగ్‌ అంటే అస్సలు చేయలేం. అందుకే సిద్దూ నేనూ కలిసి కొన్ని రోజులు డేటింగ్ చేసాం, క్లోజ్‌గా తిరిగాం. ఇద్దరి మధ్యా బాగా చనువు ఏర్పడిన తరువాతే ఆ సాంగ్‌, సన్నివేశాలు చేశామని రష్మి తెలిపింది.


ఐటం సాంగ్స్ మీద..

ఐటం సాంగ్స్ మీద..

ఐటం సాంగ్స్ చేయడానికి ఒప్పుకున్నారతగ కదా అనే ప్రశ్నకు రష్మి స్పందిస్తూ...స్టార్‌ హీరోయిన్లే ఐటెంసాంగ్స్‌ చేస్తూ కోటి రూపాయలకు పైగా తీసుకుంటున్నారు. నేను చేస్తే తప్పేంటి? అంటూ ఎదురు ప్రశ్నించింది రష్మి.


ఆఫర్స్

ఆఫర్స్

‘గుంటూర్‌ టాకీస్‌' చేస్తున్న సమయంలోనే 15 సినిమాల్లో ఐటెంసాంగ్‌ చేయమంటూ అవకాశాలు వచ్చాయి అని రష్మి తెలిపింది.


అందుకే అభ్యంతరం లేదు

అందుకే అభ్యంతరం లేదు

ఐటెంసాంగ్‌ అంటూ చులకన చేస్తారు కానీ, వాటినే ప్రేక్షకులు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారు. అందుకే అవి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని రష్మి తేల్చి చెప్పింది.


తర్వాతి మూవీ

తర్వాతి మూవీ

తన తర్వాత సినిమా గురించి మాట్లాడుతూ...‘తను వచ్చెనంట' అనే హారర్ సినిమాలో చేస్తున్నాను అన్నారు.


English summary
Rashmi Gautam hot scene in Guntur Talkies. Due to the hot scenes in Guntur Talkies movie the box office collections are highly increased now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu