»   » రేష్మి హాట్ సీన్స్ హైలెట్ (వీడియో)

రేష్మి హాట్ సీన్స్ హైలెట్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'చందమామ కథలు' చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గుంటూరు టాకీసు'. సిద్ధు జొన్నలగడ్డ, రేష్మి, శ్రద్ధాదాస్ ముఖ్యపాత్రల్లో ఆర్.కె. స్టూడియోస్ పతాకంపై ఎం.రాజ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. ఆ టీజర్ లో రేష్మి హాట్ గా కనపడుతోంది. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.


ఈ సినిమా గుంటూరు స్లమ్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో ప్రవీణ్ ఎలాంటి మెసేజ్ ఇవ్వడం లేదని ఈ చిత్ర టీం అంటోంది. ఈ సినిమాలో 200 మంది స్థానిక కళాకారులకు అవకాశం ఇచ్చినట్లు వివరించారు. మానవీయ విలువల మేళవింపుతో సాగే ఈ చిత్రంలో అంతర్లీనంగా చక్కటి సందేశముంటుందని చిత్ర బృందం చెబుతోంది.


దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ.... చందమామ కథలు తర్వాత నేను చేస్తున్న సినిమా ఇదన్నారు. గుంటూరు పట్టణంలో జరిగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, అందుకే దీనికి ఈ టైటిల్ పెట్టామని, పూర్తిస్థాయి కామెడీ చిత్రమిదని అన్నారు. ఇందులో నాలుగు పాటలున్నాయని, ఇప్పటికే షూటింగ్ పూర్తైందని అన్నారు.


Rashmi Gautam's Guntur Talkies Teaser

నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ..... నేషనల్ అవార్డు పొందిన దర్శకుడితో పనిచేయడం ఆనందంగా వుందని, ఇప్పటికే టాకీని పూర్తిచేశామని అన్నారు. త్వరలోనే పాటల చిత్రీకరణకోసం బ్యాంకాక్‌కు వెళ్తున్నాం అన్నారు.


హీరో సిద్ధు మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు. ముఖ్యంగా జాతీయ అవార్డు పొందిన ప్రవీణ్‌గారితో పనిచేయడం ఆనందంగా వుందని అన్నారు. రేష్మి మాట్లాడుతూ టీవి యాంకర్‌గా చేస్తున్న తనకు ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం కల్పించిన ప్రవీణ్, ప్రొడ్యూసర్ ఆర్.కెలకు థ్యాంక్స్ అన్నారు.

English summary
Here is the much awaited teaser of our unusual comedy called Guntur Talkies. Praveen Sattaru, the director of sensible films such as LBW & Chandamama Kathalu, is arriving with his next 'Guntur Talkies'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu