»   » ‘‘ఇంటికి రా.. స్వర్గం చూపిస్తా’’ రేష్మి ఓపెన్ ఆఫర్, కుర్రాళ్లు ఆగటం కష్టమే

‘‘ఇంటికి రా.. స్వర్గం చూపిస్తా’’ రేష్మి ఓపెన్ ఆఫర్, కుర్రాళ్లు ఆగటం కష్టమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జబర్దస్త్ పోగ్రామ్ తో పాపులర్ అయ్యిన రేష్మి ఇప్పుడు సినిమాలతోనూ బిజీ అవుతోంది. ముఖ్యంగా ఆ మధ్యన చేసిన గుంటూరు టాకీస్ చిత్రం ఆమెకు బాగా పేరు తెచ్చి పెట్టింది. అందులో ఆమె తన అందాలు ఆరబోసి మరీ హిట్ కొట్టడం చాలా మంచి దర్శక,నిర్మాతలకు ఊతం ఇచ్చింది. దాంతో వరస పెట్టి ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయియ

అదే ఊపులో రేష్మి ఇటీవల 'అంతం' అనే చిత్రంలో నటించింది. జిఎస్‌ఎస్‌పి కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతం అనే చిత్రంలో రేష్మి లీడ్ రోల్ పోషించింది. చరణ్‌దీప్, రేష్మితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ట్రైలర్‌ను విడుదల చేసారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

లవ్, రొమాన్స్, హర్రర్ మిళితంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. త్వరలో విడుదల కానున్న అంతం చిత్రానికి కార్తీక్ రాడ్రిగ్జ్ ఈ చిత్రానికి మంచి స్వరాలను సమకూరుస్తున్నాడు.

సినిమా ఎలా ఉంటుందో కానీ ట్రైలర్ మాత్రం అదరకొట్టారనే చెప్పాలి. ఈ ట్రైలర్లో తొలి సగం రొమాన్స్.. రెండో సగం థ్రిల్ ఉండేలా ప్లాన్ చేసి అదరకొట్టారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో రేష్మి తన భర్తతో తమ కొత్త ఫ్లాట్లో రొమాన్స్ ఎంజాయ్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది.

Rashmi Gautham's Antham (2016) Official Trailer

ఐతే ఒక రోజు రేష్మి ఒక్కతే ఇంట్లో ఉండగా తన భర్త నుంచి కాల్ వస్తుంది. భర్త కారు నడుపుకుంటూ వస్తూ.. ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడు అంటూ భయపడుతూ అడుగుతాడు. అయితే ఆమె మాత్రం భర్త తనతో జోక్ చేస్తున్నాడనుకుంటుంది. కాసేపటి తర్వాత ఆమెకు తాను ప్రమాదంలో ఉన్నానని అర్థం అవుతుంది.

ఇక భర్త వచ్చేలోపు తనకొచ్చిన ఆపద నుంచి ఆమె ఎలా బయటపడిందిన్నది మిగతా కథ అని మనకి ఈ ట్రైలర్ చూస్తే అర్దం అవుతుంది. ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతోంది...థ్రిల్ ఉందా లేదా అనే సంగతి పక్కనబెడితే.. ట్రైలర్లో ప్రధానంగా రష్మి అందాలే హైలైట్ అయ్యాయి. చివర్లో ''ఇంటికి రా.. స్వర్గం చూపిస్తా'' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. జూన్ చివరి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Antham is a Suspense Thriller Produced & Directed by GSSP Kalyan Starring Rashmi Gautam, Charandeep, Vasu Dev, Sudarshan. Music by Karthik Rodriguez. Sound Effect by Ethiraj, Stunts by Ram Sunkara
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu