»   » విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రం నుంచి లావణ్య త్రిపాఠి ఔట్.. సెన్సేషనల్ హీరోయిన్ ఎంట్రీ..

విజ‌య్ దేవ‌ర‌కొండ చిత్రం నుంచి లావణ్య త్రిపాఠి ఔట్.. సెన్సేషనల్ హీరోయిన్ ఎంట్రీ..

Written By:
Subscribe to Filmibeat Telugu

అర్జున్ రెడ్డి విజయం తర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ తన చిత్రాల వేగం పెంచాడు. గీతాఆర్ట్స్ బ్యాన‌ర్, పెళ్లిచూపులు నిర్మాత యష్ రంగినేని చిత్రాలకు పచ్చ జెండా ఊపాడు. అల్లు అర‌వింద్‌, బన్నివాసు, ప‌రశురాం, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్ వస్తున్న చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మండన్నాను ఎంపిక చేశారు. ఇటీవ‌ల కాలంలో చిన్న‌చిత్రంగా విడుద‌ల‌య్యి ట్రెండింగ్ స‌క్స‌స్ ని సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి చిత్రంతో అంద‌రి అభిమానాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే.

లావణ్య త్రిపాఠి ఔట్..

లావణ్య త్రిపాఠి ఔట్..

అంతకుముందు హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి అనుకొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల లావణ్య త్రిపాఠి తప్పుకోవడంతో రష్మిక మండన్నా ఆ ఛాన్సు దక్కింది. లావణ్య త్రిపాఠి ఎందుకు తప్పుకున్నదనే విషయంపై అనేక కథనాలు ఫిలింనగర్లో చక్కర్లు కొడుతున్నాయి.

గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో

గీతాఆర్ట్స్ బ్యాన‌ర్లో

2016లో వ‌రుస‌గా " స‌రైనోడు, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ధృవ " లాంటి హ్యట్రిక్ సూప‌ర్‌హిట్స్ తో దూసుకుపోతున్న గీతాఆర్ట్స్ కి అనుభంద సంస్థ గా జీఏ2 బ్యాన‌ర్ లో భ‌లేభ‌లేమ‌గాడివోయ్ లాంటి చిత్రం త‌రువాత నిర్మాత బ‌న్నివాసు మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ మంచి క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ ను ' శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు' ద‌ర్శ‌కుడు ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు.

బ‌న్ని వాసు నిర్మాత‌గా..

బ‌న్ని వాసు నిర్మాత‌గా..

బ‌న్ని వాసు నిర్మాత‌గా నాగ‌చైతన్య తో '100%ల‌వ్', సాయిధ‌ర‌మ్‌తేజ్ తో 'పిల్లా నువ్వులేని జీవితం', నాని తో 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' ఇప్ప‌డు విజ‌య్ దేవ‌ర‌కొండ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా ఎంపికైంది.

రష్మిక మండన్నాకు ఛాన్సు

రష్మిక మండన్నాకు ఛాన్సు

కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న రష్మిక... కిరాక్ పార్టీ చిత్రంతో అందరి మనసుల్ని దోచుకుంది. అందం అభినయంతో ఆకట్టుకున్న రష్మిక విజయ్ దేవర కొండ సరసన నటించే అవకాశం దక్కించుకోవడం విశేషం. త్వరలోనే షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

English summary
After the Walkout of Lavanya Tripathi, Cute lady Rashmika Mandanna Roped in for Vijay Deverakonda and director Parasuram Combo Love Entertainer. Bunny Vasu is the producer. This movie made under Allu Aravind's Geeta Arts banner. This movie will go onto floor very soon
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu