»   »  విశాల్ తోనే అంకిత పెళ్లి..డేట్, వెన్యూ ఫిక్స్

విశాల్ తోనే అంకిత పెళ్లి..డేట్, వెన్యూ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్స్ అందరికీ వరస పెట్టి పెళ్లిళ్లు జరుగుతున్నాయి. నిన్న ప్రితి జింతా పెళ్లి వార్తతో మీడియా హోరెత్తి పోతే ఇప్పుడు రస్నాబేబి పెళ్లి రోజు ఫిక్స్ చేసుకుని వార్తల్లోకి వచ్చింది.

ఇండ్రస్టిలిస్ట్ జేపీ మోర్గన్ వైస్ ప్రెసిడెంట్, ఛైర్మన్ విశాల్ జగ్ తాప్ తో అంకిత... ఏడడుగుల వేయడానికి సిద్దమయ్యింది. ఈ నెల 28న రెండు గంటలకు ముంబైలోని మేఫెయిర్ బోంకెట్ ఫైవ్ స్టార్ హోటల్ లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ , బాలీవుడ్ తారలు హాజరుకానున్నారని సమాచారం.

Rasna Baby Ankita reddy for marriage


అంకిత ఈ పేరు వినగానే మనకు ఎన్టీఆర్ సింహాద్రి, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలు గుర్తుకువస్తాయి. ఈ సినిమాల తర్వత కొన్ని సినిమాలు చేసినా అవి ఆశించినంత ఆడకపోవడంతో, ఇక్కడ నుండి అమెరికా వెళ్లిపోయింది.

అక్కడ డైరక్షన్ కోర్స్ చేసి... ఓ ఇద్దరు హాలీవుడ్ డైరక్టర్స్ దగ్గర పని చేసింది, దీనితో ఆమె మెగా ఫోన్ పట్టి డైరక్టర్ అవుతుందని అందుర అంచనాలు వెసుకున్నారు. కానీ వాటిని బ్రేక్ చేస్తూ ఈ వివాహ నిర్ణయం తీసుకుంది

క్రితం సంవత్సరం నవంబర్‌ 6 ఉదయం ముంబైలోని జె.పి. మారియట్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో అంకిత, విశాల్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. మరి వివాహం తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
Ankitha is getting married on March, 25th in Mumbai. The bridegroom is an NRI, Vishal Jagthap, the Vice President of JP Morgan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu