»   » చలపతిరావు వివాదం: మా నాన్నను చంపేయండన్న రవి బాబు!

చలపతిరావు వివాదం: మా నాన్నను చంపేయండన్న రవి బాబు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో సీనియర్ నటుడు చలపతి రావు మహిళలపై చేసిన కామెంట్స్ తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని కుదిపేసింది. ఈ వ్యవహారంలో చలపతి రావు క్షమాపణలు చెప్పినా మహిళా సంఘాలు శాంతిచలేదు. ఆయనపై క్రిమినల్ కేసులు, నిర్భయ కేసులు కూడా నమోదయ్యాయి.

యాభై ఏళ్ల నట జీవితంలో ఎంతో గౌరవంగా బ్రతికిన తనను.... ఈ ఒక్క కామెంటుతో చరిత్ర హీనుడిగా మార్చరంటూ బహిరంగ లేఖలో చలపతిరావు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై చలపతి రావు కొడుకు, దర్శకుడు, నటుడు రవి బాబు కూడా స్పందించారు.


రవిబాబు స్పందిస్తూ...

రవిబాబు స్పందిస్తూ...

ఈ వయసులో మా నాన్నకు మద పిచ్చి ఎక్కువైంది. అందుకనే ఆయన ఆడవాళ్లపై ఇలాంటి వ్యాఖ్యలు చేసారు. మా అమ్మ చిన్నతనంలో చనిపోయారు. కానీ మా నాన్న మళ్లీ పెళ్లి చేసుకోలేదు. మమ్మల్ని బాగా చదివించే క్రమంలో ఆయన తన గురించి కానీ, తన సుఖాల గురించి కానీ ఆలోచించలేదు కాబట్టే ఆయనకు మదపిచ్చి అని అనుకుంటున్నాను... అని తనదైన రీతిలో స్పందించారు రవి బాబు.


వాళ్లు పెద్దోళ్లు కాబట్టి ఎవరూ నోరు మొదపలేదు

వాళ్లు పెద్దోళ్లు కాబట్టి ఎవరూ నోరు మొదపలేదు

‘భార్య ఉండగానే మరో వివాహం చేసుకున్న వారు మా నాన్న గురించి విమర్శిస్తుంటే బాధగా ఉంది. గతంలో సినిమా పరిశ్రమలో పెద్దలుగా చెప్పుకునే వారు మహిళలపై ఇంతకంటే దారుణంగా కామెంట్స్ చేసినా ఎవ్వరూ నోరు మొదపలేదు. ఎందుకంటే వారి రేంజి ఎక్కువ కాబట్టి. కానీ పొరపాటన ఓ మాట ఎక్కువగా మాట్లాడి, తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగినా కూడా ఈ రకమైన కామెంట్స్ వింటుంటే నాకు చాలా మనో వేదనగా ఉంది అని రవి బాబు అన్నారు.


శారీరకంగా చంపేయండి

శారీరకంగా చంపేయండి

మా నాన్నపై ఈ విధమైన కామెంట్స్ చేసి ఈ వయసులో ఆయన్ను మానసికంగా చంపడం కంటే... ఆయనపై శారీరకంగా దాడి చేసి చంపేయండి.... అపుడు అందరికీ మనశ్శాంతి కలుగుతుంది. ఒక కొడుకుగా ఆయన గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లడలేను అని రవి బాబు అన్నట్లు సమాచారం.


అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నటుడు చలపతి రావు

అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: నటుడు చలపతి రావు

ఒకానొక సందర్భంలో నటుడు చలపతిరావు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడట. ఆయన చెప్పిన పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!

రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో చలపతి రావు మహిళలను ఉద్దేశించి చేసిన నీచమైన కామెంట్స్ వల్ల ఆయనతో పాటు యాంకర్ రవిని కూడా ఇబ్బందుల్లో నెట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.English summary
Ravi Babu reacted to controversial comments on his father Chalapathi Rao. Ravi Babu has tried to make his points citing some examples and even he asked people to kill him rather than giving his father mental tension continuously.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu