»   » రవితేజ 'డాన్‌ శీను' కి ఎంత క్రేజ్ అంటే

రవితేజ 'డాన్‌ శీను' కి ఎంత క్రేజ్ అంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ, త్రిష కాంబినేషన్లో 'కృష్ణ' చిత్రం తర్వాత వస్తున్న 'డాన్‌ శీను' చిత్రాని కి మార్కెట్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది.కిక్ వంటి సూపర్ హిట్ నిర్మాతల మలి చిత్రం కావటం ఓ కారణమైతే, పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ చిత్రమని ప్రచారం జరగటం మరో ఎత్తు. ఈ క్రేజ్ ని నిజం చేస్తూ ఇంకా షూటింగ్ తొలి దశలోనే ఉన్న ఈ చిత్రా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ఏషియన్‌ ఫిలింస్‌ సునీల్‌ ఫ్యాన్సీ ఆఫర్‌తో సొంతం చేసుకున్నారు.అలాగే ఓవర్‌సీస్‌ రైట్స్‌ని గ్రేట్‌ ఇండియా ఫిలింస్‌ సంస్థ వారు దక్కించుకున్నారని నిర్మాత తెలిపారు.ప్రముఖ నటుడు శ్రీహరి ఓ ముఖ్యపాత్రను చేస్తున్న ఈ చిత్రం ద్వారా గోపిచంద్ మలినేని అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అలాగే ఢీ వంటి వినోదాత్మక చిత్రం రచన చేసిన కోనవెంకట్ ఈ చిత్రానికి రచన చేయటం మరో ప్లస్ అయింది.ఇక కథ ప్రకారం రవితేజ అమితాబ్ డాన్ చిత్రానికి వీర ఫ్యాన్ గా ఆ డైలాగులు చెబుతూ మై హూ డాన్ అంటూ తిరుగుతూంటాడు. అతన్ని ఊళ్ళో వాళ్ళంతా డాన్ శీను అని పిలుచుకుంటూంటాడు. దాన్ని నిజం చేసుకోవటానికి అతను హైదరాబాద్ వస్తాడు. అక్కడ డాన్ గా ఉన్న శ్రీహరి మనుషులను కొడతాడు. ఎందుకు కొట్టావు అంటే నీ దృష్టిలో పడటానికే అంటాడు. దాంతో అతను రవితేజని ఎలా గయినా ఇరికించాలని ముంబయిలో మరో పెద్ద డాన్ చెల్లెలను లైన్ లో పెట్టమని పురమాయిస్తారు.దాంతో అక్కడికి వెళ్ళి త్రిషను లైన్ లో పెట్టిన తర్వాత తను పురమాయించిన అమ్మాయిని కాక తన చెల్లినే లైన్ లో పెట్టాడని తెలుసుకున్నా ఒరిజనల్ డాన్ రవితేజని ఏం చేస్తాడు...అలాగే రవితేజకు అంత అవసరం ఏమొచ్చిందనే ప్లాష్ బ్యాక్ సెకెండాఫ్ లో ఉంటుందంటున్నారు. ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఈ కథనం నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఆర్‌.ఆర్‌.మూవీ మేకర్స్‌అధినేత వెంకట్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తూంటే కె.అచ్చిరెడ్డి సమర్పకుడిగా..సహ నిర్మాతగా వి.సురేష్‌ రెడ్డి వ్యవహిస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu