»   » డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించారు: రవితేజ ఫ్యాన్స్ ఆందోళన

డ్రగ్స్ కేసులో అన్యాయంగా ఇరికించారు: రవితేజ ఫ్యాన్స్ ఆందోళన

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ చిత్ర పరిశ్రను కుదిపేస్తున్న డ్రగ్స్ కేసు విచారణ పర్వంలో ప్రస్తుతం రవితేజ వంతొచ్చింది. శుక్రవారం ఉదయం రవితేజ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిట్ కార్యాలయం ఎదుట పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది.

రవితేజ ఫ్యాన్స్ భారీగా సిట్ కార్యాలయం వద్దకు చేరుకుని తమ అభిమాన హీరోకు మద్దతుగా ఆందోళన చేపట్టారు. డ్రగ్స్ కేసులో రవితేజను అన్యాయంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.

కట్టదిట్టమైన భద్రత

కట్టదిట్టమైన భద్రత

రవితేజ మాస్ హీరో కావడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ముందే ఊహించిన పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న అభిమానులపై పోలీసులు బలప్రయోగం లాంటివి చేయకుండా వారిని శాంతింపజేసి అక్కడి నుండి పంపించే ప్రయత్నం చేశారు.

Ravi Teja to Appears Before SIT on Friday(July 28)
రవితేజపై ప్రశ్నల వర్షం

రవితేజపై ప్రశ్నల వర్షం

రవితేజను సిట్ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. మీ సోదరులకూ, మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా..?, కెల్విన్, జీషాన్‌లు మీకు ఎన్నాళ్లుగా పరిచయం? ఇలా రకరకాలుగా ప్రశ్నించినట్లు తెలిసింది. పూరితో సినిమా షూటింగ్‌ల సమయంలో ఎక్కెడెక్కడికి వెళ్లేవారు? ఇద్దరూ కలిసి డ్రగ్స్ తీసుకునే వారా? ఇలా రకరకాలుగా ప్రశ్నించినట్లు సమాచారం.

డ్రగ్స్ గురించి

డ్రగ్స్ గురించి

షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ గడుపుతారు?, విదేశాలకు వెళ్లినప్పడు మీ అలావాట్లు ఎంటి? అని రవితేజను పోలీసులు ప్రశ్నించారు. జీషాన్, కెల్విన్‌లతో పరిచయం కావాడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి?, ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లలలో కెల్విన్‌కు మీతో పనేంటి? అంటూ వివిధ కోణాల్లో రవితేజను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

సోదరుడి గురించే ఎక్కువ ప్రశ్నలు

సోదరుడి గురించే ఎక్కువ ప్రశ్నలు

గతంలో రవితేజ సోదరుడు భరత్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల కారు ప్రమాదంలో భరత్ మరణించాడు. భరత్ డ్రగ్స్ వాడేవాడా? మీకు డ్రగ్స్ అందించే వాడా? ఇలా రకరకాల ప్రశ్నలతో రవితేజను ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది.

English summary
Tollywood actor Hero Raviteja Fans protest at Excise Office Over SIT Investigation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu