»   »  రవితేజ ‘బలుపు’ పై కోన వెంకట్ కామెంట్

రవితేజ ‘బలుపు’ పై కోన వెంకట్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  హైదరాబాద్ : రవితేజ బాడీలాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు తగ్గట్టుగా 'బలుపు' అనే మరో విభిన్న టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇంతకు ముందు రవితేజతో 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం రచయిత కోన వెంకట్ ఈ చిత్రం గురించి ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

  కోన వెంకట్ ట్వీట్ చేస్తూ..., "ఇప్పుడే ఫైనల్ ఎడిట్ వెర్షన్ బలుపు చూసాను. ఇది సూపర్ హిట్ చిత్రం అవుతుంది... రవితేజ తిరిగి ఫామ్ లోకి వస్తారు. శ్రుతి హాసన్ ఈ సినిమాలో అదరకొట్టింది. బ్రహ్మానందం చాలా బెస్ట్ గా చేసారు. అంజలి & ప్రకాష్ రాజ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. గోపీచంద్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతాడు. పివిపి బ్యానర్ వారు మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించారు. తమన్..ఈ సినిమా కు మంచి సంగీతం అందిచి మరింత ఎత్తుకు తీసుకు వెళ్లాడు."


  ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‍‌తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.

  ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

  English summary
  
 Kona Venkat tweeted, "Just watched the final edit of BALUPU.. It's a super hit film.. Raviteja is back. Shruti Haasan is d show stealer in Balupu. Brahmi at his best. Anjali & Prakashraj are big assets to d film. Gopichand hits d bulls eye. PVP cinema deserves the full credit for its extravagant production values. Thaman did a great job in lifting the film up." Balupu directed by Gopichand Malineni and produced by PVP Cinemas with cinematography by Jayanan Vincent and music by Thaman is gearing up for worldwide release on June 28.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more