మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా షురూ... (ఫోటోస్)
మాస్ మహరాజ రవితేజ హీరోగా కొత్త సినిమా శుక్రవారం ప్రారంభం అయింది. సోగ్గాడే చిన్ననాయన, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన యంగ్ డైరక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

ఫస్ట్ డే షూట్ ఫోటో షేర్ చేసిన రవితేజ
ఫస్ట్ డే షూటింగుకు సంబంధించిన ఫోటోను రవితేజ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా షేర్ చేశారు. ఈ రోజు నుండే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది.

ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్
ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రామ్ తాళ్ళూరి నిర్మాత ఐ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.. ముకేశ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

తొలి సినిమా
ఎస్ ఆర్ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెకకుతున్న మొదటి సినిమా ఇది. ఈ చిత్రం మా బేనర్ కు మంచి ఆరంభం అవుతుందని భావిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామనపి నిర్మాత రామ్ తాళ్ళూరి తెలిపారు.

రవితేజ నెక్ట్స్ మూవీ
ఇటీవలే ‘రాజా ది గ్రేట్' చిత్రంతో విజయం అందుకున్న రవితేజ.... త్వరలో ‘టచ్ చేసి చూడు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రమ్ సిరికొండ దర్శకునిగా పరిచయవుతున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా ప్రకటించలేదు. 2018 ఉగాదికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











