»   » ఎంట్రీలో ‘మాస్ రాజా’ క్లైమాక్స్ లో రవితేజ ‘మిరపకాయ్’

ఎంట్రీలో ‘మాస్ రాజా’ క్లైమాక్స్ లో రవితేజ ‘మిరపకాయ్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రేజీస్టార్‌ అండ్ మాస్ రవితేజ హీరోగా, రిచా గంగోపాధ్యాయ, దీక్ష హీరోయిన్స్‌ గా ఎల్లో ఫ్లవర్స్‌ బ్యానర్‌ పై హరీష్‌ శంకర్‌ ఎస్‌. దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత రమేష్‌ పుప్పాల నిర్మిస్తున్న 'మిరపకాయ్‌" చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరపుకుంటోంది. ఈ చిత్రం ప్రొగ్రస్‌ గురించి నిర్మాత రమేష్‌ పుప్పాల మాట్లాడుతూ..'బ్యాంకాక్‌లో ఈ నెల 19 నుంచి చిత్రంలోని ప్రధాన తారగణం పాల్గొనగా 12 రోజుల పాటు భారీ ఎత్తున క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తాం. తర్వాత యూరప్‌లో 3 పాటల్ని చిత్రీకరించడంతో షూటింగ్‌ పూర్తవుతుంది. రవితేజ బాడీ ల్యాంగ్వేజికి తగినట్టుగా అందర్నీ ఎంటర్‌టైన్‌ చేసే మాస్‌ క్యారెక్టర్‌ని అద్భుతంగా పోషిస్తున్నారు. అన్ని వర్గాలవారిని అలరించే విధంగా హరీష్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు" అన్నారు.

కాగా రీసెంట్ గా తమ ఓన్ బ్యానర్ గోపికష్ణా మూవీస్ లో 'మాస్ రాజా" అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించారు రెబల్ స్టార్ కష్ణం రాజు. అయితే ఆ టైటిల్ ప్రభాస్ కోసం కాకపోవడం విశేషం. ఆ చిత్రాన్ని రవితేజ హీరోగా కష్ణం రాజు నిర్మించనుండడం మరో విశేషం. ఇటీవల డాన్ శీను చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన గోపిచంద్ మలినేని 'మాస్ రాజా" పేరుతో మంచి కమర్షియల్ సబ్జెక్ట్ చెప్పడం, అది నచ్చిన కష్ణం రాజు ప్రొడ్యూస్ చేసేందుకు సిధ్దపడటం జరిగిందట. అలాగే గోపికష్ణా బేనర్ లో గోపిచంద్ డైరెక్షన్ లో 'మాస్ రాజా" గా మరేందుకు రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కాగా ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోన్న ఈ చిత్ర వివరాలను త్వరలో వెల్లడికానున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu