»   » ఉగాది రోజున రవితేజ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల

ఉగాది రోజున రవితేజ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ మహారాజా రవితేజ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమా ఫస్ట్‌లుక్‌ను ఉగాది పర్వదినాన విడుదల చేయనున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన డైరెక్టర్ కళ్యాణ్‌కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

రవితేజ సరసన మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, ఆలి, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Ravi Teja new movie first look on Ugadi

దాదాపు 60% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. ఫిదా ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం, ఛోటా కే ప్రసాద్ కెమెరా, బ్రహ్మ కడలి కళ, ముఖేష్ ఎడిటింగ్ బాధ్యతలు సమకూరుస్తున్నారు.

English summary
After Raja The Great movie success, Ravi Teja doing a project with Director Kalyan Krishna. This movie in post production stage. This movie first look set release on Ugadi festival. Malavika Sharma is the lead pair for Ravi Teja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu