twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ పరిస్థితి ఇలా అయిందేంటి? ఆ ముగ్గురు నిర్మాతలే కారణమా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సినిమా పరిశ్రమలో దారుణమైన పరిస్థితి ఏమిటో తెలుసా..? ఒక స్టార్ హీరో సినిమాలు లేకుండా ఖాళీగా ఉండటమే. ఈ ఖాళీ సమయం పెరిగే కొద్దీ ఆ హీరోకు జనాల్లో క్రేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వరుస ప్లాపులు ఉన్నా, చేతిలో సినిమాలే లేకున్నా దాదాపు ఒకటే పరిస్థితి.

    తాజాగా మాస్ మహరాజా రవితేజ పరిస్థితి అలానే ఉంది. రవితేజ చివరి సినిమా 'బెంగాల్ టైగర్' ఈ సినిమా విడుదలై దాదాపు సంవత్సరం దగ్గరపడింది. పైగా ఆ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. 2016 సంవత్సరంలో రవితేజ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం గ్యాపులో ఆయన ఖాళీగానే ఉన్నారు. సెట్స్ పై కూడా సినిమాలేవీ లేవు.

    మాస్ మహరాజ్ పరిస్థితికి కారణం ఎవరు?

    మాస్ మహరాజ్ పరిస్థితికి కారణం ఎవరు?

    తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ముగ్గురు నిర్మాతల వల్లే రవితేజ ఈ సంవత్సర కాలంగా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వారి నిర్వాకం కారణంగా ఆయన ఇతర సినిమాలు కమిట్ కాక, వారు తీసుకొచ్చిన చెత్త కథలను చేయలేక కోట్లాది రూపాయలు నష్టపోయారని టాక్.

    ఆ నిర్మాతలు ఎవరు?

    ఆ నిర్మాతలు ఎవరు?

    అయితే ఆ నిర్మాతలు ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతలు కావడంతో వారి పేరు బయటకు చెప్పడానికి ఎవరూ ఇష్టపడటం లేదు. సదరు నిర్మాతలు రవితేజతో సినిమాలు చేస్తామని కమిట్ అయిన తొలత ఓ కథ చెప్పి ఒప్పించి...స్క్రిప్టు వర్క్ పూర్తయ్యేసరికి కథను పూర్తిగా మార్చి వినిపించారట. అసలే ప్లాపుల్లో ఉన్న రవితేజ ఆ మార్చిన స్క్రిప్టు చేస్తే మరో ప్లాపు తప్పదనే భావనతో వారితో తెగదెంపులు చేసుకున్నట్లు టాక్.

    డబ్బు కంటే కథే ముఖ్యం

    డబ్బు కంటే కథే ముఖ్యం

    భారీగా అడ్వాన్స్ ఇస్తే రవితేజ సినిమా ఒప్పుకుంటారనే పేరుంది. దీన్ని ఆసరాగా చేసుకునే రవితేజ తమ గుప్పిట్లో పెట్టుకున్నారని టాక్. ఈ గొడవలు, వివాదం కారణంగానే రవితేజ సినిమా ఈ ఏడాది ఇప్పట వరకు ఏదీ పట్టాలెక్కలేదు. అందుకే ఆయన మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడటం లేదు. వస్తే ఏం సినిమా చేస్తున్నారు, సినిమా అవకాశాల్లేవా? అంటూ ప్రశ్నలతో ఇబ్బంది పెడతారనే ఆయన మీడియాకు దూరంగా ఉంటున్నారట.

    అలాంటి నిర్మాతలకు దూరం

    అలాంటి నిర్మాతలకు దూరం

    ఈ మధ్య కాలంలో రవితేజ హిట్లకంటే ఫెయిల్యూర్లే ఎక్కువ ఫేస్ చేసారు. అందుకే ఇకపై కథకే ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారట. తనకు నచ్చితే చేస్తా, ముందు తనకో కథ చెప్పి తర్వాత ఏవో కారణాలు చెప్పి కథలో మార్పులు చేయించే నిర్మాతలకు దూరంగా ఉండాలని రవితేజ నిర్ణయించుకున్నారట.

    ఆ సినిమా ఏమైనట్లు?

    ఆ సినిమా ఏమైనట్లు?

    ఆ మధ్య రవితేజ రెండు ప్రాజెక్టులను ఫైనల్‌ చేశారని, అందులో ఒకటి రచయిత విక్రమ్‌ సిరి చెప్పిన కథ అని, అతడి దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్టు ప్రచారం జరిగింది కానీ పరిస్థితి చూస్తుంటే ఇది కూడా మధ్యలోనే ఆగినట్లు స్పష్టమవుతోంది.

    బాబీ దర్శకత్వంలో

    బాబీ దర్శకత్వంలో

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ బాబీ(కె.ఎస్.రవీంద్ర) దర్శకత్వంలో సినిమా కమిటైనట్లు అక్టబర్ 12న షూటింగ్‌ మొదలవుతుందని టాక్. ఈ సినిమాకు కోన వెంకట్ స్క్రీన్ ప్లే, డైలాగులు అందిస్తున్నారట. రామ్ తాళ్లూరి, వెంకట్ తలారి శ్రీ ఐశ్వర్యలక్ష్మి ఫిల్మ్స్ పతాకంపై ఈ సినిమా నిర్మించబోతున్నారట. తమన్ సంగీతం అందిస్తున్నారని, రాశి ఖన్నా హీరోయిన్ గా ఖరారైందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు వివరాలు అఫీషియల్ గా రిలీజ్ కావాల్సి ఉంది.

    English summary
    Flim Nagar source said that, KS Ravindra (Bobby) locked a script and impressed Ravi Teja. The movie is said to be a hilarious laugh riot and Rashi Khanna has been roped in to play the female lead. The film which will start rolling from October 12th during Dasara.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X