twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షార్ట్ ఫిలిం చూపెట్టండి...నన్ను డైరక్ట్ చేయండి: రవితేజ

    By Srikanya
    |

    ఇన్ని సంవత్సరాలు,ఇన్ని సినిమాలు చేసిన తర్వాత మెట్ట మొదటి సారిగా దొంగల ముఠా సినిమా తీయటానికి ఉపయోగించిన కొత్త టెక్నాలిజీని నేను ప్రత్యక్షంగా చూసి, కేనన్ 5డి కెమెరాతో పనిచెయ్యటం మూలాన ఇప్పుడు నేను తెలుసుకున్నదేమిటంటే, అస్సలు ఏ మాత్రం ఎక్సపీరియన్స్ అనేది లేకుండా, క్రూ మెంబర్స్ లేకపోయినా, జేబులో ఒక్క పైసా అయినా లేకుండా కేవలం వాళ్ళకొక ఐడియా ఉంటే చాలు ఎవరైనా,ఎక్కడైనా, ఏ ఊళ్ళో అయినా , ఎప్పుడైనా సినిమా తీయవచ్చని.

    ఈ నేపధ్యంలో నేను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఈ టెక్నాలిజీని అర్దం చేసుకున్న ఎవరితోనైనా, నాతో సినిమా తీయాలనే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏ మాత్రం ఎక్సపీరియన్స్ లేకపోయినా, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా సినిమా ఇండస్ట్ర్రీలో లైట్ మెన్ అయినా, సాఫ్ట్ వేర్ కంపినీలో ఆఫీస్ బోయ్ అయినా, రైల్వే స్టేషన్ లో కూలీ అయినా, పొలం దున్నుకునే రైతైనా, కారు మెకానిక్ అయినా, కాలేజి స్టూడెంట్ అయినా ఇంకా ఇంకా ఎవరెవరైనా సరే వాళ్ళు అనకాపల్లిలో ఉన్నా, ఉప్పలపాడులో ఉన్నా, కరీంనగర్ లో ఉన్నా, కాలిఫోర్నియాలో ఉన్నా, బొంబాయిలో ఉన్నా, దుబాయిలో ఉన్నా, ఇంకా ఇంకా ఎక్కడెక్కడున్నా సరే నేను ఇందాక చెప్పినట్లు కేవలం నాతో సినిమా తియ్యాలని వాళ్ళకి ఇంట్రెస్టు ఉంటే మాత్రం చాలు అన్నారు.

    అలాగే కేనన్ 5 డి కెమెరాతోనో, ఇంకా అలాంటి వాటి వేటితోనైనా, ఒక మూడు నుంచి ఐదు నిముషాల నిడివి కల ఒక సినిమా తీసి నాకు చూపెడితే నాకు బెస్ట్ అనిపించిన సినిమా తీసిన వాళ్ళతో నేను వెంటనే సినిమా చెయ్యటానికి రెడీ..మీరు తీసిన సినిమాలు నా దగ్గరకు ఎలా రీచ్ అవ్వాలో త్వరలో తెలియచేస్తాను..అంటూ రవితేజ మీడియాకు ప్రెస్ నోట్ పంపించారు.

    English summary
    Ravi Teja has given a ‘mass call’ for all the aspiring directors today. He says that he is ready to give dates to act if anybody impresses him with an idea making a short clip or a few scenes using a ‘digital camera’.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X