»   » బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో రవితేజ మూవీ షూటింగ్!

బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో రవితేజ మూవీ షూటింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్ ఇంట్లో రవితేజ మూవీ షూటింగ్!

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం ప్రస్తుతం యూఎస్ఏలో షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజతో పాటు ఇతర ముఖ్య తారాగణంపై మార్చి 26 నుండి ఇక్కడ షూటింగ్ ప్రారంభం అయింది. తొలుత న్యూయార్కులో కొన్ని సీన్లు చిత్రీకరించిన అనంతరం షూటింగ్ కాలిఫోర్నియాకు షిప్టయింది.

కాలిఫోర్నియా సమీపంలోని లాంగ్ ఐలాండ్‌లో ప్రముఖ హాలీవుడ్ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్‌కు సంబంధించిన భవనం పలాటియల్ హిడెన్ హిల్స్ మాన్షన్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని శ్రీను వైట్ల ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేశారు.

శ్రీను వైట్ల బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్

‘జెన్నిఫర్‌ లోపెజ్‌‌కు ప్రపంచ వ్యాప్తంటగా మిలియన్ల కొద్దీ వీరాభిమానులు ఉన్నారు. వారిలో నేనూ ఒకడిని. క్వీన్‌ ఆఫ్‌ పాప్‌ నివాసమైన పలాటియల్ మాన్షన్‌లో మా తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను చిత్రీకరిస్తున్నాం. నా కల నిజమైంది. ఇది నా బిగ్గెస్ట్ ఫ్యాన్ మూవెంట్' అని శ్రీను వైట్ల ట్వీట్‌ చేస్తూ ఓ వీడియో షేర్ చేశారు.

సినిమాలో ఈ బంగళా స్పెషల్ అట్రాక్షన్

సినిమాలో ఈ బంగళా స్పెషల్ అట్రాక్షన్

జెన్నిఫర్ లోపెజ్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన భవనం ఇది. దీని ఖరీదు $12.5 మిలియన్ డాలర్లు. గతంలో ఆమె ఈ ఇంట్లో తన మాజీ భార్త మార్క్ ఆంటోనీతో కలసి కొంతకాలం నివసించారు. 17000 స్కేర్ ఫీట్ల విస్తీర్ణం ఉన్న ఈ భవనంలో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. రినోవేటెడ్ కిచెన్. రివాంప్డ్ మాస్టర్ బెడ్ రూం, స్పాతో కూడిన స్విమ్మింగ్ పూల్, రికార్డింగ్ స్టూడియో, జిమ్, 20 మంది కూర్చొని చూడగలిగే మూవీ థియేటర్, గేమ్ రూమ్, బార్, గెస్ట్ సూట్ ఉన్నాయి. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఈ భవనం స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటుందని చెబుతున్నారు.

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్

రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టెనర్

రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న 4వ సినిమా ఇది. గతంలో వీరి కాంబినేషన్లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శ్రీను లాంటి చిత్రాలు వచ్చాయి. ‘అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. రవితేజ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో వీన్‌ యెర్నేని, రవి శంకర్‌, మోహన్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

శ్రీను వైట్లకు ఎంతో కీలకం

శ్రీను వైట్లకు ఎంతో కీలకం

అమర్ అక్బర్ ఆంటోనీ దర్శకుడు శ్రీను వైట్లకు ఎంతో కీలకమైన సినిమా. ఈ మధ్య వరుస ప్లాపులతో వెనకపడ్డ ఆయనకు ఎట్టకేలకు రవితేజ లాంటి పెద్ద హీరోతో అవకాశం దక్కింది. ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫాంలోకి రావాలనేది శ్రీను వైట్ల ప్లాన్.

English summary
Director Sreenu Vaitla kick-started the shooting for Ravi Teja's upcoming Telugu movie Amar Akbar Antony (AAA) at Jennifer Lopez's palatial Hidden Hills mansion in Long Island, California, in the US. The director also said it was a dream-come-true moment. Sreenu Vaitla tweeted: "Been her craziest fan throughout my life..the heartthrob of millions ..the evergreen queen of pop ..and here I am Shooting right in her palatial mansion in Long Island .Dreams do come true ! My biggest fan moment jlo #AAA."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X