»   »  ‘దూసుకెళ్తా’ చిత్రానికి...మాస్ హీరో వాయిస్ ఓవర్

‘దూసుకెళ్తా’ చిత్రానికి...మాస్ హీరో వాయిస్ ఓవర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న 'దూసుకెళ్తా' చిత్రంలో మాస్ మహరాజ్ రవితేజ వాయిస్ ఓవర్ వినబోతున్నాం. గతంలో రవితేజ మర్యాద రామన్న చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా హిట్టవడంతో రవితేజ వాయిస్ ఓవర్ సెంటిమెంటుగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

రవితేజతోనే వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఓ ముఖ్య కారణం కూడా ఉందట. ఈ చిత్రంలో హీరో చిన్నతంలో వచ్చే సన్నివేశాలకు రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కాస్త ఎటకారంగా, కామెడీ జోడీస్తూ మాట్లాడటంలో రవితేజ దిట్ట. అందకే దర్శకుడు వీరూ పోట్ల ఈ ప్లాన్ చేసారు.

సినిమా వివరాల్లోకి వెళితే...ఈచిత్రం అక్టోబర్ 11న విడుదలవుతోంది. ఇందులో విష్ణు జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. విష్ణు సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్‌గా నటిస్తోంది. పూర్తి వినోదాత్మకంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు. దర్శుకుడు మాట్లాడుతూ... ''కథకు అతికినట్లు సరిపోయే పేరు అదే. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో మేళవించి ఉంటాయి. నిదానమే ప్రధానం.. అనే మాట అస్సలు పట్టించుకోడు. వేగం కూడా విస్తుపోయేలా దూసుకెళ్తేనే విజయం.. అనేది అతను నమ్మే సిద్ధాంతం. ఆ ప్రయాణంలో అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ''అన్నారు.

విష్ణు మాట్లాడుతూ ''ఢీ, దేనికైనా రెడీ తరవాత నా కెరీర్‌లో చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం ఉంది. వినోదం, యాక్షన్‌లు కలగలిపిన ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దిన విధానం తప్పకుండా అందరికీ నచ్చుతుంది. సాంకేతికంగానూ ఉన్నత స్థాయిలో ఉంటుంది. మణిశర్మ బాణీలు అదనపు బలం'' అన్నారు. బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్‌, రావు రమేష్‌, పంకజ్‌ త్రిపాఠీ, రఘుబాబు, సురేఖావాణి, హేమ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సర్వేష్‌ మురారి, కూర్పు: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, సమర్పణ: ఆరియానా, వివియానా.

English summary

 Mass Maharaj Ravi Teja has given voice over for Manchu Vishnu's upcoming film Doosukeltha, directed by Veeru Potla. Lavanya Tripati is cast opposite Vishnu. The movie is all set to release on Oct 11th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu