»   » మహేష్ ముంచేసాడు...మరి రవితేజ తేలుస్తాడా

మహేష్ ముంచేసాడు...మరి రవితేజ తేలుస్తాడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పట్లో యు.టివి వారు మహేష్ తో కలిసి అతిధి చిత్రం నిర్మించిన సంగతి తెలిసిందే. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాన్నుంచి కోలుకోవటానికి మహేష్ కి మూడేళ్ళు పడితే, యు.టివి వారికి నాలుగేళ్ళు పట్టింది. ఇప్పుడు వారు రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు వారు రవితేజతో సిట్టింగ్స్ జరిపినట్లుతెలుస్తోంది. సౌత్ రీజియన్ హెడ్ ధనుంజయ్ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. రవితేజతో జరిగిన మీటింగ్ చాలా ఉత్సాహభరితంగా జరిగిందని, రవితేజ కూడా చాలా ఎక్సైట్ అయ్యాడని అన్నారు. అంటే త్వరలో రవితేజతో వారు సినిమా చేయనున్నారన్నమాట. అయితే డైరక్టర్ ఎవరన్నది మాత్రం ఫిక్స్ కాలేదు. అతిధితో ప్లాప్ ఇచ్చిన సురేంద్ర రెడ్డి ఆ తర్వాత రవితేజకు కిక్ తో హిట్టిచ్చాడు కాబట్టి పాత పరిచయాలను పురస్కరించుకుని క్రేజీ కాంబినేషన్ అయ్యేటట్లుగా సురేంద్రరెడ్డితో చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం రవితేజ వీర చిత్రం చేస్తున్నారు.

English summary
Ravi Teja might soon sign a film which will be produced by UTV Motion Pictures. Dhananjayan, the chief of UTV Motion Pictures, South had hinted at this collaboration a little while ago on a social networking site.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu