»   » రవిబాబు కొత్త చిత్రం అదిగో ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

రవిబాబు కొత్త చిత్రం అదిగో ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు.

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌:ప్రయోగాత్మక కథాంశాలు, రొటీన్‌కు భిన్నమైన నేపథ్యాల్ని ఎంచుకుంటూ సినిమాల్ని తెరకెక్కిస్తుంటారు రవిబాబు. ప్రస్తుతం పందిపిల్ల ప్రధాన పాత్రధారిగా ఓ సినిమా చేస్తున్నారాయన. అభిషేక్, నాభ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అదుగో అనే టైటిల్‌ను రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. పందిపిల్ల చుట్టూ తిరిగే కథ ఇదని, ఆద్యంతం వినోదాన్ని పంచుతుందని రవిబాబు చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

రేష్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని పందిపిల్లపై తెరకెక్కిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పందిపిల్ల, దానిపై కత్తితో ఉన్న ఓ చేయిని ఫస్ట్‌లుక్‌లో చూపించారు. కత్తిపై 'ది సమ్మర్‌' అని రాసి ఉంది.. సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పంది పిల్లపై వస్తున్న తొలి చిత్రమిదని చిత్ర వర్గలు చెబుతున్నాయి.


'అల్లరి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన విలక్షణమైన దర్శకుడు, నటుడు రవిబాబు ఈసారి ఎవరూ ఊహించనటువంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంది దర్శకులు కుక్కలు, కోతులు, ఏనుగులు, ఈగలు వంటివి పెట్టి సినిమాలు తీశారు. కానీ రవిబాబు స్టైలే వేరు. ఏకంగా పందిపిల్లతో సినిమా తీస్తున్నారు. నిజంగా ఇప్పటివరకు ఇలాంటి సాహసాన్ని ఎవరూ చేసుండరు.

Ravibabu piglet movie Adhugo first look!

పందిపిల్ల ముఖ్య పాత్రగా తెరకెక్కే ఈ చిత్రంలో అభిషేక్, నాభ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ''అదుగో'' అనే టైటిల్‌ను ఖరారు చేయటానికి కూడా కారణం ఉందిట. రవిబాబుకి 'అ' సెంటిమెంట్ ఎక్కువని అందరికి తెలిసిందే. అందుకే ఈ టైటిల్‌ని ఫిక్స్ చేసినట్టు సినీవర్గాలు అంటున్నాయి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సపోర్టుతో ఇలాంటి విలక్షణ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి రవిబాబు సిద్ధమయ్యారు.

డి.సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. పందిపిల్లపై సినిమా చేయడం తొలిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని డిఫరెంట్ స్క్రిప్ట్‌తో సినిమా రూపొందించడంలో ఎదురైన అనేక సవాళ్ళను దాటి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఆడియో, సినిమా విడుదల గురించి వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు తెలియజేశారు.

English summary
Director Ravi Babu's new flick Adhugo first look is shocking and frightful. Produced by Suresh Babu's Suresh Productions and Flying Frog Productions, the film will be released in 2017 summer.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu