»   » రవితేజ...మూడు రోజులు పోలీస్ స్టేషన్ లోనే

రవితేజ...మూడు రోజులు పోలీస్ స్టేషన్ లోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :రవితేజ మూడు రోజుల పాటు పోలీస్ స్టేషన్ లో ఉండనున్నారు. నిజమైన పోలీస్ స్టేషన్ అనుకునేరు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో రవితేజపై మూడు రోజులు పాటు కంటిన్యూగా సీన్స్ తీస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌ నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాలను రవితేజ, బ్రహ్మాజీ, అజయ్‌, కోట శ్రీనివాసరావు తదితర తారాగణంపై చిత్రీకరిస్తున్నారు. మూడు రోజులపాటు అక్కడే చిత్రీకరణ జరుగుతుంది.

'విక్రమార్కుడు'లో మీసం మెలేసి మరీ సందడి చేసిన రవితేజ క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అందరినీ మెప్పించింది. తాజాగా ఆయన మరోసారి ఖాకీ కట్టారు. 'పవర్‌' కోసం. ఖాకీ దుస్తులు ఒంటిపై పడితే రవితేజ తెరపై ఏ స్థాయిలో రెచ్చిపోతారో తెలిసిందే. రవితేజ, హన్సిక జంటగా నటిస్తున్న చిత్రమిది. రెజీనా కీలక పాత్ర పోషిస్తోంది. కె.ఎస్‌.రవీంద్రనాథ్‌ (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ జరుగుతోంది.

నిర్మాత మాట్లాడుతూ... ''రవితేజ శైలికి తగ్గ చిత్రమిది. వినోదం, యాక్షన్‌, భావోద్వేగాల మేళవింపుతో రూపొందుతోంది. ఇందులో రవితేజ రెండు కోణాల్లో సాగే పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో 'మాస్‌ అంటే బస్సు పాసు కాదురా...' అంటూ చెప్పిన సంభాషణలకి చక్కటి స్పందన లభించింది''అని అన్నాయి.

Raviteja movie 'Power' progressing at R F C

మాస్‌ అంటే బస్‌పాస్‌ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్‌ బట్టి జనం పిలుచుకునే పిలుపు వంటి మాస్ డైలాగులతో ఈ చిత్రం రవితేజ కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగులుతుందని అంటున్నారు. ''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.

రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్‌లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్‌రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్‌లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).

English summary
Ravi Teja’s new movie 'Power' shooting is progressing at Ramoji Film City Hyderabad. The movie is pencilled to an action entertainer and Hansika is sharing screen space with Ravi Teja. A special set has been floated in which the unit is canning action episodes and scenes on the Ravi Teja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu