»   » ర‌వితేజ 'బెంగాల్‌టైగ‌ర్‌' సినిమా పరిస్థితి ఏమిటి?

ర‌వితేజ 'బెంగాల్‌టైగ‌ర్‌' సినిమా పరిస్థితి ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మాస్ మహరాజ్‌ రవితేజ, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నాలు జంట‌గా సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న చిత్రం 'బెంగాల్ టైగ‌ర్'. ఈ చిత్రాన్ని ఏమైంది ఈవేళ, అధినేత, ప్యార్ మే పడిపోయానే వంటి ఉత్త‌మాభిరుచి వున్న‌ చిత్రాల్ని అందించిన నిర్మాత కె కె రాధామోహన్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం విజ‌య‌వంతంగా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని ఈరోజు నుండి మూడ‌వ షెడ్యూల్ ని రామోజిఫిల్మ్ సిటి లో ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో బ్ర‌హ్మ‌నందం ఎంట‌రవుతున్నారు. జూన్‌15 వ‌ర‌కూ జ‌రిగే ఈ షెడ్యూల్ లో టాకీ తో పాటు హీరో, హీరోయిన్స్ పై రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ చేస్తారు.


నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ... ‘మా బ్యాన‌ర్ లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు జంట‌గా నిర్మిస్తున్న చిత్రం 'బెంగాల్ టైగ‌ర్'. సంప‌త్ నంది ద‌ర్శ‌కుడు. బోమ‌న్ ఇరానితో పాటు రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు న‌టిస్తున్నారు. విజ‌య‌వంతంగా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని ఇప్ప‌డు మూడ‌వ షెడ్యూల్ రామోజిఫిల్మ్ సిటి, అన్న‌పూర్ణ మ‌రియు హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జూన్ 15 వ‌ర‌కూ జ‌రుపుకుంటుందన్నారు.


Raviteja's Bengal Tiger into 3rd Schedule

ఈ షెడ్యూల్ లో హీరో, హీరోయిన్స్ మ‌రియు ఇత‌ర తారాగాణంతో పాటు బ్ర‌హ్మ‌నందం గారు ఎంట‌ర‌వుతున్నారు. హీరో ర‌వితేజ‌, బ్ర‌హ్మ‌నందం గారి కాంబినేష‌న్ అంటేనే దియోట‌ర్స్ లో న‌వ్వులకురుస్తాయి, గెస్ట్ పాత్ర‌ల్లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రానే, అక్ష న‌టిస్తున్నారు.


టాకీ తో పాటు హీరో, హీరోయిన్స్ తో రెండు పాట‌లు చిత్రీక‌రిస్తాము. ర‌వితేజ గారి ఎన‌ర్జిలెవెల్ ఈ సినిమా కి హైలెట్ గా నిలుస్తుంది. ఈ చిత్రానికి యంగ్ ఎన‌ర్టిటిక్ టాలెంటెడ్ తొ మ్యూజిక్ చేయిస్తున్నాము. ఈ వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తాము. మండుటెండల్లో సైతం బ్రేక్ తీసుకోకుండా చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేయటానికి చిత్ర యూనిట్ కష్టపడుతుంది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ని ఆకట్టుకునేలా తెర‌కెక్కిస్తున్న మా బెంగాల్ టైగ‌ర్ ని వినాయ‌క చ‌వితి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నాము' అని అన్నారు.


దర్శకుడు సంపత్‌నంది మాట్లాడుతూ... ‘మాస్ మహరాజ్ రవితేజ గారి ఎన‌ర్జినే మా 'బెంగాల్ టైగ‌ర్' చిత్రం. ర‌వితేజ గారిని స్క్రీన్ మీద ఎలా ఆడియ‌న్స్ చూడాల‌నుకుంటారో అదే రేంజిలొ చిత్రాన్ని రూపోందిస్తున్నాము. ఉత్త‌మాభిరుచున్న‌ కె కె రాధామోహన్ గారు నిర్మాత‌. బోమ‌న్ ఇరాని మా చిత్రం లో న‌టిస్తున్నారు. త‌మ‌న్నా, రాశిఖ‌న్నా ల ప్రాత్రలు కూడా చాలా బాగా వ‌చ్చాయన్నారు.


ఈ రోజు ప్రారంభ‌మైన మూడవ షెడ్యూల్ లొ హీరో, హీరోయిన్స్ తో పాటు ప్ర‌ముఖ తారాగాణం అంతా న‌టిస్తారు ఈ షెడ్యూల్ లోనే బ్ర‌హ్మ‌నందం గారు న‌టిస్తారు. ర‌వితేజ గారు, బ్ర‌హ్మ‌నందం గారు క‌లిస్తే ఆడియ‌న్స్ న‌వ్వుల‌కి కొద‌వుండ‌దు ఈ షెడ్యూల్ జూన్ 15 వ‌ర‌కూ రామోజిఫిల్మ్ ‌సిటి, అన్న‌పూర్ణ స్టూడియోస్ మ‌రియు హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ లో టాకీతో పాటు రెండు సాంగ్స్ కూడా చిత్రీక‌రిస్తాము. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి వినాయ‌క చ‌వితికి విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహ‌లు చేస్తున్నాము.' అని అన్నారు.


ఈ చిత్ర‌లో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్ర‌హ్మ‌నందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హ‌వ‌ర్ధ‌న్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్ర‌భు, ప్ర‌గ‌తి, నాగినీడు, ప్ర‌భ‌, ర‌మాప్ర‌భ తదిత‌రులు ఈ షెడ్యూల్ లో న‌టించారు. బ్యాన‌ర్‌: శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమోరా: సుంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌మ్‌రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్య‌నారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, నిర్మాత‌:కె.కె.రాథామెహ‌న్‌.'

English summary
Raviteja Movie Bengal Tiger into 3rd Schedule |Ravi Teja movie 'Bengal Tiger' directed by Sampath Nandi has started today(13th May 2015) .
Please Wait while comments are loading...