»   » ‘అ.అ.ఆ’: రవితేజతో రచ్చచేయించనున్న శ్రీను వైట్ల.... కమెడియన్‌గా సునీల్ రీఎంట్రీ!

‘అ.అ.ఆ’: రవితేజతో రచ్చచేయించనున్న శ్రీను వైట్ల.... కమెడియన్‌గా సునీల్ రీఎంట్రీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాస్ మహారాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభం అయింది. దుబాయ్ శీను లాంటి హిట్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్‌తో ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి "అమర్ అక్బర్ ఆంటోనీ" అనే టైటిల్ ఖరారు చేశారు.

రవితేజ సరసన అను ఎమ్మాన్యుల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడక్షన్ నెం.6గా రూపొందిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

 స్క్రిప్టు కోసం 10 నెలలు కష్టపడ్డాం

స్క్రిప్టు కోసం 10 నెలలు కష్టపడ్డాం

ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ "నా హీరో రవితేజతో మళ్లీ ఇన్నాళ్ల తర్వాత చేస్తున్న సినిమా "అమర్ అక్బర్ ఆంటోనీ". ఈ కథకి బీజం ఏడాది క్రితం పడింది. పది నెలలపాటు కష్టపడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాం' అని తెలిపాపరు.

 90 శాతం షూటింగ్ అక్కడే

90 శాతం షూటింగ్ అక్కడే

ఈ చిత్రం షూటింగ్ 90 శాతం అమెరికాలో జరుగుతుంది. న్యూయార్క్, డెట్రాయిట్, సాల్ట్ లేక్ సిటీ మరియు ఇతర లొకేషన్స్ లో చిత్రీకరణ జరపనున్నాం. అత్యధిక శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకోనున్న మొట్టమొదటి తెలుగు చిత్రం ఇదే అని శ్రీను వైట్ల తెలిపారు.

 రవితేజతో నాది హిట్ కాంబినేషన్

రవితేజతో నాది హిట్ కాంబినేషన్

రవితేజతో నా తొలి సినిమా ‘నీ కోసం' చేశారు. ఈ చిత్రానికి 7 నంది అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత మా కాంబినేషన్లో వచ్చిన వెంకీ, దుబాయ్ శ్రీను చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. మేమే ఇద్దరం సినిమా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇన్నాళ్లకు కుదిరింది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల అంచనాలను నిజం చేస్తామనే నమ్మకం ఉంది అని శ్రీను వైట్ల తెలిపారు.

 భారీ తారాగణం

భారీ తారాగణం

ఈ చిత్రం కోసం చాలా భారీ తారాగణాన్ని ఎంపిక చేశాం. అను ఇమ్మాన్యేయేల్ హీరోయిన్. విలన్స్ గా తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్, రాజ్ వీర్ సింగ్, ఆదిత్య మీనన్ నటిస్తున్నారు. నిన్నటితరం కథానాయకి లయ మరియు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు అని శ్రీను వైట్ల తెలిపారు.

 సునీల్ కెమడియన్‌గా రీ ఎంట్రీ

సునీల్ కెమడియన్‌గా రీ ఎంట్రీ

హీరోగా మారిన స్టార్ కెమడియన్ సునీల్ ఈ చిత్రం ద్వారా కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సునీల్ ఫుల్ లెంగ్త్ కామిక్ రోల్ ప్లే చేయనున్నారు. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, శకలక శంకర్, జయప్రకాష్ రెడ్డిగారు ఇంకా చాలా మంది కమెడియన్లు నటిస్తున్నారు.... అని శ్రీను వైట్ల తెలిపారు.

రవితేజ తనయుడు కూడా

రవితేజ తనయుడు కూడా

ఈ చిత్రంలో రవితేజ తనయుడు మహాధన్ మరో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. "అమర్ అక్బర్ ఆంటోనీ" చిత్రానికి భారీ తారాగణం ప్లస్సవుతుందని, సినిమాకు హైలెట్ అవుతుందని రవితేజ తెలిపారు.

 నటీనటులు

నటీనటులు

రవితేజ, అను ఎమ్మాన్యుల్, సునీల్, లయ, శ్లోక (లయ కుమార్తె), మహాధన్ (రవితేజ కుమారుడు), అభిమన్యు సింగ్, తరుణ్ అరోరా, విక్రమ్ జీత్ సింగ్, రాజ్ వీర్ సింగ్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, వెన్నెల కిషోర్, సత్య, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, శుభలేఖ సుధాకర్, దివ్య ఉన్ని, సిజొయ్ వర్గీసి, భరత్ రెడ్డి, గిరిధర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఐ.శ్రీనివాస్ రాజు, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, స్టిల్స్: సాయిరాం మాగంటి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె.కళ్యాణ్-బాలాజీ, కో-డైరెక్టర్: సుభాష్ జెట్టి, చీఫ్ కో-డైరెక్టర్: సీహెచ్ రామారావు, రచన సహకారం: ప్రవీణ్ వర్మ-కొల్లిపార ప్రవీణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, కళ: ఏ.ఎస్.ప్రకాష్, ఎడిటర్: ఎం. ఆర్.వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రాఫర్: విజయ్ సి.దిలీప్, కథ: శ్రీనువైట్ల-వంశీ రాజేష్ కొండవీటి, సి.ఈ.ఓ: చిరంజీవి (చెర్రీ), నిర్మాతలు: నవీన్ యెర్నేని-వై.రవిశంకర్-మోహన్ (సివిఎం), స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: శ్రీనువైట్ల.

English summary
Crazy combination of Mass Maharaja Raviteja and the loyal brand for entertainment director Sreenu Vytla combination is back. After beginning their careers with critically acclaimed Nee Kosam followed by super hits Venky, Dubai Seenu; once again Vytla-Ravi are back into show business with Mythri Movies Production No 6 officially launched today with the muhurtham shot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu